Begin typing your search above and press return to search.

చిన్న కొడుకుతో ఇలియానా క్యూట్ పిక్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన గోవా బ్యూటీ ఇలియానా ది క్రూజ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ తన ఫ్యామిలీ లైఫ్‌ను ఎంతో హ్యాపీగా గడుపుతున్నారు.

By:  Madhu Reddy   |   19 Aug 2026 12:42 PM IST
చిన్న కొడుకుతో ఇలియానా క్యూట్ పిక్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
X

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన గోవా బ్యూటీ ఇలియానా ది క్రూజ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ తన ఫ్యామిలీ లైఫ్‌ను ఎంతో హ్యాపీగా గడుపుతున్నారు. విదేశీయుడైన మైఖేల్ డోలన్‌ను సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ భామ, 2023లో మొదటి బాబుకు, 2025లో రెండో బాబుకు జన్మనిచ్చారు. తాజాగా తన చిన్న కొడుకుతో ఉన్న ఒక క్యూట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో అది కాసేపట్లోనే వైరల్ అయింది. నెటిజన్లు ఈ ఫోటోపై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

టాలీవుడ్‌లో కుర్రకారు కలల రాణి..

2006లో 'దేవదాసు' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఇలియానా, అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి క్రేజీ ఆఫర్లను అందుకున్నారు. ఇక ఆమె గ్లామర్, నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

'పోకిరి'తో మారిన జాతకం..

పూరీజగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన 'పోకిరి' చిత్రం ఇలియానా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఇలియానా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఇక ఆ తర్వాత ఆమె కోసం నిర్మాతలు క్యూ కట్టారు. అయితే 'పోకిరి' తర్వాత ఆమె నటించిన ఐదు సినిమాలు వరసగా ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన 'జల్సా' సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు.

బాలీవుడ్ ప్రయాణం.. సినిమాలకు స్వస్తి..

టాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న సమయంలోనే ఇలియానా హఠాత్తుగా తెలుగు సినిమాలకు దూరమై బాలీవుడ్‌కు వెళ్లారు. అక్కడ కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. ఇక ఆ తర్వాత క్రమంగా సినిమాలకు గుడ్ బై చెప్పి తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టారు.

పూర్తిగా ఫ్యామిలీ ఉమెన్‌గా ఇలియానా :

ప్రస్తుతం ఇలియానా గ్లామర్ రంగానికి దూరంగా ఉంటూ కంప్లీట్ ఫ్యామిలీ ఉమెన్‌గా మారిపోయారు. భర్త మైఖేల్ డోలన్, ఇద్దరు పిల్లలతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు. ఇద్దరు కొడుకులను చూసుకుంటూ ఎంతో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు.

సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన ఇలియానా, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారు. ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫోటోను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ దంపతులకు, పిల్లలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.