Begin typing your search above and press return to search.

అదే మొద‌టి ప్రియారిటీ!

రీసెంట్ గా ఓ లైవ్ సెష‌న్ లో పాల్గొన్న ఇలియానా త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్, కెరీర్ తో పాటూ త‌న రీఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 Sept 2025 2:00 AM IST
అదే మొద‌టి ప్రియారిటీ!
X

ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. తెలుగులోని స్టార్ హీరోలంద‌రితో వ‌రుస పెట్టి న‌టించిన ఇలియానా ఎంత స్లిమ్ గా ఉంటారో అంద‌రికీ తెలిసిందే. ఇలియానా యాక్టింగ్ కంటే ఆమె న‌డుముకే ఎక్కువ ఫ్యాన్స్ ఉండేవారు. అంత క్రేజ్ ఉంది ఆమె న‌డుముకి. అలాంటి ఇలియానాలో పెళ్లి త‌ర్వాత చాలా మార్పులొచ్చాయి. అప్ప‌టివ‌ర‌కు నాజూగ్గా క‌నిపించిన ఇలియానా బొద్దుగా క‌నిపించడం చూసి అంద‌రూ షాక‌య్యారు.

పెళ్లికి ముందే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఇలియానా

లావుగా మారాక సినిమాల‌కు బై బై చెప్పిన ఆమె, ఫ్యాన్స్ కు షాకుల మీద షాకులిచ్చారు. పెళ్లికి ముందే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి మొద‌టిసారి షాకిచ్చిన ఇల్లూ బేబీ, ఆ త‌ర్వాత త‌న భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేశారు. పెళ్లి ఎప్పుడు ఎలా జ‌రిగిందనేది చెప్ప‌కుండా రెండోసారి త‌ల్లి కాబోతున్న‌ట్టు అనౌన్స్ చేసి మ‌రో షాకిచ్చారు. మొత్తానికి ఇలియానా ప్ర‌స్తుతం భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నారు.

రీఎంట్రీపై ఇలియానా కామెంట్స్

రీసెంట్ గా ఓ లైవ్ సెష‌న్ లో పాల్గొన్న ఇలియానా త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్, కెరీర్ తో పాటూ త‌న రీఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతానికి త‌న టైమ్ మొత్తాన్నీ ఇద్ద‌రు పిల్ల‌ల‌కే కేటాయిస్తున్నాన‌ని, సినిమాల్లోకి తిరిగి రావాల‌ని చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాన‌ని, కెమెరా ముందు యాక్ట్ చేయ‌డం, అద్భుత‌మైన వ్య‌క్తుల‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డాన్ని మిస్ అవుతున్నాన‌ని, ఫ్యాన్స్ త‌న‌ను మిస్ అవుతున్నార‌నే విష‌యం కూడా త‌న‌కు తెలుస‌ని చెప్పారు.

అందుకే యాక్టింగ్ కు రెస్ట్ ఇచ్చా

యాక్టింగ్ అంటే త‌నకెంతో ఇష్ట‌మ‌ని, కానీ ప్ర‌స్తుతానికి త‌న పిల్ల‌లే ప్ర‌పంచ‌మ‌ని, వారి ఆల‌నాపాల‌నా చూడ‌ట‌మే త‌న ఫ‌స్ట్ ప్రియారిటీ అని, అందుకే యాక్టింగ్ కు రెస్ట్ ఇచ్చాన‌ని చెప్పారు. కొద్ది రోజులాగి మ‌ళ్లీ ఇండ‌స్ట్రీలోకి వ‌స్తాన‌ని, రీఎంట్రీ ఇచ్చేముందు మెంట‌ల్ గానే కాకుండా ఫిజిక‌ల్ గా కూడా తాను రెడీ అవాల‌ని, అలా సిద్ధ‌మ‌వడానికి కొంత టైమ్ ప‌డుతుంద‌ని, ఏ ప‌ని చేసినా దానికి పూర్తి న్యాయం చేయాల‌నుకునే టైపుని నేను అంటూ ఇలియానా చెప్పుకొచ్చారు. అయితే కాస్త లేటైనా మ‌ళ్లీ రీఎంట్రీ ఇస్తాన‌ని చెప్ప‌డంతో ఇలియానా ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తుండ‌గా, ఇల్లూ బేబీ వెండితెర‌పై మ‌ళ్లీ ఎప్పుడు సంద‌డి చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు.