సెట్లో దర్శకుడు తిట్లు తట్టుకోలేకపోయాను: ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ నుంచి నిష్కృమించి చాలా కాలమే అయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసాక, తన విదేశీ ప్రియుడిని పెళ్లాడింది
By: Sivaji Kontham | 17 Sept 2025 9:47 AM ISTగోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ నుంచి నిష్కృమించి చాలా కాలమే అయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసాక, తన విదేశీ ప్రియుడిని పెళ్లాడింది. ఇద్దరు పిల్లలకు `మామ్` కూడా అయింది. తన రెండో ప్రసవం సమయంలో చాలా ఇబ్బందికి గురయ్యానని కూడా ఇలియానా వెల్లడించింది.
తాజా ఇంటర్వ్యూలో ఇంకా చాలా వ్యక్తిగత, వృత్తిగత విషయాను ప్రస్థావించింది. వీటిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఒక విషయం ఉంది. అది తన తొలి హిందీ చిత్రం గురించిన స్టోరి. మొదటి ప్రయత్నమే రణబీర్ కపూర్ లాంటి పెద్ద స్టార్ సరసన అవకాశం దక్కింది. అనురాగ్ బసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ ఒక సందర్భంలో సెట్స్ నుంచి ఆల్మోస్ట్ తాను నిష్కృమించాల్సిన సన్నివేశం తలెత్తిందని ఇలియానా తెలిపింది. దర్శకుడు అనురాగ్ బసు తన విషయంలో తీవ్ర నిరాశను బయటపెట్టారు. దాంతో నేను సినిమా నుండి దాదాపుగా తప్పుకున్నాను అని తెలిపింది.
ఒకసారి బసు నాపై తీవ్రంగా విరుచుకుపడ్డారని వెల్లడించింది. ``ఒకరోజు ఉదయం నేను సెట్‌లోకి చాలా సంతోషంగా వెళ్లాను. కానీ అప్పటికే ఆయన మానసిక స్థితి అంతా బాలేదు. ఇబ్బందికరంగా ఉన్నారు.. ఏదో ఆయనను బాధపెట్టింది. నేను వెళ్లగానే నాపై విరుచుకుపడ్డాడు. దానికి నిజంగా బాధపడ్డాను. ``దాదా.. వినండి.. నేను ఈ పాత్రకు సరైనదానిని కాదని మీరు అనుకుంటే.. నా పనితో మీరు సంతోషంగా లేకుంటే నేను వెళ్లిపోతాను.. నేను మీపై దావా వేయబోవడం లేదు. నేను వెళుతున్నానని చెప్పాను`` అని నాటి ఘటనను వివరించింది ఇలియానా.
అయితే క్రియేటివ్ రంగంలో ఏది ఎందుకు నచ్చదో, ఎవరైనా ఎందుకు నచ్చరో ఎవరూ చెప్పలేరు. చిత్రీకరణ సమయంలో చాలా సాధకబాధకాలు, సమస్యలు ఉంటాయి. అనురాగ్ బసు ఆ రోజు ఎలాంటి టెన్షన్ లో ఉన్నారో ఏమిటో.. రాంగ్ టైమ్‌లో ఇలియానా అతడి వద్దకు వెళ్లడంతో చీవాట్లు తినాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఏడ్చేసి నిర్మాతకు కాల్ చేయాలనుకున్నానని కూడా ఇలియానా తెలిపింది. కానీ అనురాగ్ తో ఎలాగోలా అడ్జస్ట్ అయి సినిమాని పూర్తి చేసింది. బర్ఫీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది.
