Begin typing your search above and press return to search.

IIFA 2026 విజేతలు వీరే.. అత్యధిక అవార్డులతో ‘ధురంధర్’ సెన్సేషన్!

ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' ఈసారి ఐఫా అవార్డుల వేదికపై దండయాత్ర చేసింది.

By:  Madhu Reddy   |   31 Oct 2026 8:24 PM IST
IIFA 2026 విజేతలు వీరే.. అత్యధిక అవార్డులతో ‘ధురంధర్’ సెన్సేషన్!
X

భారతీయ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 26వ ఐఫా (IIFA) 2026 అవార్డుల ప్రకటన వచ్చేసింది! ఈ ఏడాది అవార్డుల రేసులో అగ్ర కథానాయకుడు రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం ఊహించని రీతిలో రికార్డులను తిరగరాసింది. ప్రధాన విభాగాలు, సాంకేతిక విభాగాలు కలిపి ఏకంగా 12 ట్రోఫీలని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. మరోవైపు యూత్‌ఫుల్ మూవీ ‘సైయారా’ 5 అవార్డులను దక్కించుకోగా, డిజిటల్ ఓటీటీ విభాగంలో ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ విశేషంగా నిలిచింది. ఐఫా విజేతల పూర్తి వివరాలు మీకోసం..

‘ధురంధర్’ అవార్డుల సునామీ:

ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' ఈసారి ఐఫా అవార్డుల వేదికపై దండయాత్ర చేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (ఆదిత్య ధార్), ఉత్తమ నటుడు (రణ్‌వీర్ సింగ్), ఉత్తమ సహాయ నటుడు (సంజయ్ దత్), ఉత్తమ నెగెటివ్ రోల్ (అక్షయ్ ఖన్నా) వంటి అత్యంత ప్రధానమైన అవార్డులన్నీ ఈ సినిమాకే దక్కడం విశేషం. అంతేకాకుండా స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ మరియు సౌండ్ డిజైన్ విభాగాల్లోనూ 'ధురంధర్' తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

మెరిసిన 'సైయారా' పాటలు & నటీనటులు:

యూత్ అండ్ మ్యూజికల్ హిట్ 'సైయారా' చిత్రం మొత్తం 5 అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో అద్భుత నటనకు గాను అనేత్ పడ్డా 'ఉత్తమ నటి'గా ఎంపికయ్యారు. అలాగే ఈ సినిమా ద్వారా పరిచయమైన ఆహాన్ పాండే 'ఉత్తమ అరంగేట్ర నటుడు (డెబ్యూ)' అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్ లిరిక్స్ (ఇర్షాద్ కామిల్), బెస్ట్ మేల్ సింగర్ (ఫహీమ్ అబ్దుల్లా), బెస్ట్ ఫిమేల్ సింగర్ (శ్రేయా ఘోషాల్) కేటగిరీల్లో 'సాయియారా' పాటలు టాప్‌లో నిలిచాయి.

సాంకేతిక విభాగాల్లో 'ఛావా' మ్యాజిక్:

సాంకేతిక విభాగాల్లో ధురంధర్‌తో పాటు 'ఛావా' చిత్రం కూడా మంచి ప్రతిభ కనబరిచింది. ఛావా చిత్రానికి గాను దిగ్గజ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ 'ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్' అవార్డును అందుకోగా, బెస్ట్ విజ్యూవల్ ఎఫెక్ట్స్ (VFX) కూడా ఛావాకే దక్కింది. ఇక రాషా తడాని 'ఆజాద్' చిత్రానికి గాను 'ఉత్తమ అరంగేట్ర నటి'గా ఎంపికవ్వగా, బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు 'వార్ 2' కి దక్కింది.

ఓటీటీ & డిజిటల్ విభాగంలో కొత్త సంచలనాలు:

ఈ ఏడాది డిజిటల్ రంగానికి సంబంధించి ప్రత్యేక విభాగాల్లో అవార్డులు అందించారు. ఆర్యన్ ఖాన్ తొలిసారి దర్శకత్వం వహించిన 'ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్' బెస్ట్ సిరీస్‌గా నిలవడమే కాకుండా, ఆయనకు బెస్ట్ డైరెక్టర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఇక డిజిటల్ మూవీస్ విభాగంలో 'బారాముల్లా' బెస్ట్ పిక్చర్‌గా, 'స్టోలెన్' చిత్రానికి గాను అభిషేక్ బెనర్జీ ఉత్తమ నటుడిగా, 'మిసెస్' చిత్రానికి గాను సాన్యా మల్హోత్రా ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకున్నారు.

ఇక మొత్తానికి 2026 ఐఫా అవార్డుల పండగలో కంటెంట్ ఉన్న సినిమాలకు, ప్రతిభగల నటీనటులకు తగిన గౌరవం దక్కింది. బిగ్ స్క్రీన్ పై 'ధురంధర్' సృష్టించిన ప్రభంజనం, డిజిటల్ స్పేస్ లో కొత్త దర్శకుల జోరు సినీ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. మరి ఈ విజేతల జాబితాలో మీ ఫేవరెట్ హీరో, సినిమా ఉన్నాయో లేదో కామెంట్ చేయండి.