Begin typing your search above and press return to search.

ఇడుపు కాయితం: 'ఉల్లిపూల' అంటూ నాగదుర్గ రొమాంటిక్ అల్లరి

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఇడుపు కాయితం' నుంచి 'ఉల్లిపూల' ఫోక్ సాంగ్ విడుదలైంది. తెలంగాణ నేటివిటీ, పల్లెటూరి యాసతో సాగిన ఈ పాటలో నాగదుర్గ డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం, హెనాగ్రేస్ గానం పాటకు జోష్ ఇచ్చాయి. వంశీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 11న విడుదల కానుంది.

By:  M Prashanth   |   28 Nov 2026 1:33 PM IST
ఇడుపు కాయితం: ఉల్లిపూల అంటూ నాగదుర్గ రొమాంటిక్ అల్లరి
X

కంటెంట్ ఉన్న కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, ఇప్పుడు 'ఇడుపు కాయితం' అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వంశీ రెడ్డి దొండపాటి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా 'ఉల్లిపూల' అనే ఫోక్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. బన్నీ వాస్, తబిత సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

ఈ పాటలో హీరోయిన్ నాగదుర్గ గుత్తా తన ఎనర్జీతో ఫుల్ డామినేట్ చేసింది. ఉల్లిపూల చీర కట్టి, బండి మీద నీతో పోంగరా నా శ్రీనివాసా అంటూ ఆమె వేసిన ఫోక్ స్టెప్స్, ఎక్స్ ప్రెషన్స్ పాటకు మంచి జోష్ తీసుకొచ్చాయి. ఒకవైపు బంజారా డ్యాన్సర్ల మధ్య నాగదుర్గ హుషారుగా స్టెప్స్ వేస్తుంటే, మరోవైపు ప్రియదర్శి తనదైన సెటిల్డ్ రియాక్షన్స్ తో కనిపించాడు. ఇద్దరి మధ్య వచ్చే మిడిల్ క్లాస్ రొమాంటిక్ మూమెంట్స్ సహజంగా కుదిరాయి.

అభినయ శ్రీనివాస్ రాసిన లిరిక్స్ లో తెలంగాణ నేటివిటీ, పల్లెటూరి యాస స్పష్టంగా కనిపిస్తోంది. శీనూ సర్వపిండి, సకినాలు పోసి గరము ఛాయే చేతికిస్తే అంటూ సాగే పదాలు వినడానికి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య ఉండే చిన్నపాటి చిలిపితనాన్ని, రోజువారీ జీవితంలోని సరదా సన్నివేశాలను పాటలో చక్కగా చూపించారు. డాబా పైన ప్రియదర్శి ఫోన్ మాట్లాడుతుంటే నాగదుర్గ ఆటపట్టించే సీన్స్, సూపర్ మార్కెట్, థియేటర్లో చిత్రీకరించిన షాట్స్ కలర్ ఫుల్ గా ఉన్నాయి.

ఫోక్ ట్యూన్స్ అందించడంలో తనదైన మార్క్ ఉన్న సురేష్ బొబ్బిలి ఈ పాటకు క్యాచీ బీట్స్ ఇచ్చారు. మరీ లౌడ్ గా కాకుండా, వినగానే కాలు కదిపేలా లైవ్లీ రిథమ్ సెట్ చేశారు. సింగర్ హెనాగ్రేస్ తన ఫోక్ వోకల్స్ తో పాటకు మంచి ఊపు తెచ్చారు. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ, ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ పాటలోని విలేజ్, లోకల్ వైబ్ ను బాగా ఎలివేట్ చేశాయి.

ఈ సినిమాలో ప్రియదర్శి, నాగదుర్గతో పాటు అభినవ్ గోమఠం కీలక పాత్రలో నటిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, తబిత సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహించే ఈ రెండు సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.

ఇయర్ ఎండ్ సీజన్ లో చిన్న సినిమాలకు మ్యూజిక్ ప్రమోషన్స్ చాలా కీలకంగా మారుతుంటాయి. ఆ విషయంలో 'ఉల్లిపూల' పాట 'ఇడుపు కాయితం' సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసేలా ఉంది. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే ఈ ఫోక్ నంబర్, రాబోయే రోజుల్లో సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ లో బాగా ట్రెండ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.