ఇడుపు కాయితం.. అందమైన జంటలో ట్విస్ట్ ఏంటి?
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మాణంలో వస్తున్న కొత్త సినిమా ఇడుపు కాయితం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రిలీజ్ చేయడం విశేషం.
By: M Prashanth | 25 Jun 2026 12:54 PM ISTసుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మాణంలో వస్తున్న కొత్త సినిమా ఇడుపు కాయితం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రిలీజ్ చేయడం విశేషం. ఈ వీడియో చూస్తుంటే ఒక బలమైన పల్లెటూరి కథను ఎమోషనల్ గా స్క్రీన్ మీదకు తీసుకురాబోతున్నట్లు అర్థమవుతోంది. సుకుమార్ టీమ్ నుంచి వచ్చే సినిమాల్లో ఉండే నాచురల్ ఫీల్ ఇందులోనూ కనిపిస్తోంది.
ఈ మోషన్ పోస్టర్ విజువల్స్ చాలా నాచురల్‌గా డిజైన్ చేశారు. హీరో ప్రియదర్శి శ్రీనివాస్ పాత్రలో బైక్ డ్రైవ్ చేస్తుండగా శ్రీలత పాత్రలో నటిస్తున్న నాగ దుర్గ వెనక కూర్చుంది. ఇద్దరు అప్పుడే పెళ్లయిన కొత్త జంట తరహాలో ఉన్నారు. బైక్ మీద బాటిల్ లో కల్లు, క్యాన్లు క్యారేజీ బ్యాగులు కట్టుకుని వాళ్ళు హైదరాబాద్ వైపు హైవే మీద ప్రయాణిస్తున్న తీరు ఈ క్యారెక్టర్ల జీవన విధానాన్ని చూపిస్తోంది.
ఇడుపు కాయితం అంటే పల్లెటూళ్లలో భార్యాభర్తలు విడిపోయేటప్పుడు పెద్దల సమక్షంలో రాసుకునే ఒప్పంద పత్రం. ఆ టైటిల్‌తో సినిమాలో బరువైన ఎమోషన్ దాగి ఉందని తెలుస్తోంది. హ్యాపీగా ఉన్న దంపతుల మధ్యలో వచ్చిన సమస్య ఏంటి ఆ ట్విస్ట్ ఏంటి అనే క్యూరియసిటీ కలుగుతోంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి నగరంలో పడే కష్టాలు లేదా భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధల చుట్టూ తిరిగే కథగా ఈ డిజైన్ చేసినట్లు అర్ధమవుతుంది. ప్రియదర్శి లాంటి నాచురల్ యాక్టర్‌ను ఈ పాత్రకు ఎంచుకోవడం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్.
బలగం సినిమాతో పల్లెటూరి కుర్రాడిగా తన మార్క్ చూపించిన అతనికి ఇలాంటి ఎమోషనల్ పాత్రలు చాలా బాగా సెట్ అవుతాయి. కొత్తమ్మాయి నాగ దుర్గ కూడా చేతికి గోరింటాకు పెట్టుకుని ఒక సగటు మిడిల్ క్లాస్ ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయినట్లు పోస్టర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది.
ఈ రస్టిక్ డ్రామాకు టెక్నికల్ టీమ్ వర్క్ పర్ఫెక్ట్ గా సింక్ అయింది. డైరెక్టర్ వంశీ రెడ్డి దొండపాటి ఎంచుకున్న ఎమోషనల్ పాయింట్‌కు సురేష్ బొబ్బిలి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది.
మట్టి వాసన తెలిసిన పల్లెటూరి కథలకు సురేష్ బొబ్బిలి అందించే మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటుందో ఈ చిన్న వీడియో గ్లింప్స్ ద్వారా మరోసారి ప్రూవ్ అయింది. భారీ బడ్జెట్ పెద్ద స్టార్లు లేకపోయినా కథలో కంటెంట్ బలంగా ఉంటే జనాలు కచ్చితంగా ఆదరిస్తారని సుకుమార్ బలంగా నమ్ముతారు. అదే నమ్మకంతో బన్నీ వాస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమా అంచనాలను పెంచుతోంది. ఇక నెక్స్ట్ రాబోయే కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.
