రాజమౌళి కంటే ధనుష్ తో వర్క్ చేయడమే కష్టం
ఇప్పటికే డైరెక్టర్ గా పలు సినిమాలతో రాణించిన ధనుష్, ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 21 Sept 2025 12:32 PM ISTకోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్, హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ గా పలు సినిమాలతో రాణించిన ధనుష్, ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అదే ఇడ్లీ కడై. తెలుగులో ఈ సినిమా ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజ్ కాబోతుంది. ఇడ్లీ కడై సినిమాను ధనుష్ దర్శకత్వం వహిస్తూ నటించారు.
కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
రీసెంట్ గా ఇడ్లీ కడై సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా, ఆ ఈవెంట్ లో సినిమాలో కీలక పాత్రలో నటించిన సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్‌ఫుల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సత్యరాజ్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ఫ్రాంఛైజ్ లో కట్టప్పగా నటించి దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారాయన.
ఇడ్లీ కడై ఎమోషనల్ ఎంటర్టైనర్
కాగా ఇడ్లీ కడై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సత్యరాజ్ ధనుష్ తో వర్క్ చేయడంపై మాట్లాడారు. రాజమౌళి, ధనుష్ ఇద్దరి వర్కింగ్ స్టైల్స్ ను కంపేర్ చేసి చూస్తే, ధనుష్ తో వర్క్ చేయడమే కష్టమని చెప్పారు. డైరెక్టర్ గా ధనుష్ కు ఉన్న క్లారిటీ గురించి మాట్లాడి అతన్ని ప్రశంసించిన ధనుష్, ఇడ్లీ కడై ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పారు.
రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా చాలా వరకు యాక్షన్ సినిమాలే చూస్తూ వస్తున్నామని, కానీ ఇడ్లీ కడై అలాంటి సినిమా కాదని, ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని సత్యరాజ్ చెప్పుకొచ్చారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళితో సినిమా చేసిన ఎవరైనా ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా కష్టమని చెప్తుంటారు కానీ సత్యరాజ్ మాత్రం రాజమౌళి కంటే ధనుష్ తో వర్క్ చేయడమే కష్టమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
