Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ ఐకానిక్ థియేట‌ర్స్ గురించి తెలుసా?

ఒక‌ప్పుడు హైద‌రాబాద్ సినీ ప్రియుల్ని అల‌రించి వినోదాన్ని అందించిన ఐకానిక్ థియేట‌ర్స్ లిస్ట్ ఇది.

By:  Ravindar Gorantla   |   28 Feb 2026 4:07 PM IST
హైద‌రాబాద్ ఐకానిక్ థియేట‌ర్స్ గురించి తెలుసా?
X

హైద‌రాబాద్ న‌గ‌రం గొప్ప సంస్కృతి, ఛారిత్ర‌క ఆధారాల‌కు, క‌ట్టడాల‌కు నిల‌యం. చారిత్ర‌క ఐకానిక్ క‌ట్ట‌డాలు, హెరిటేజ్ బిల్డింగ్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. సినిమా ప్రియుల మ‌న‌సు దోచుకున్న ఐకానిక్ థియేట‌ర్లు ఎన్నో శ్వాతంత్రానికి పూర్వ‌మే ఇక్క‌డ వెలిశాయి. 1940లో వినోదం కోస‌మే ప‌లు సినిమాహాళ్లు ఉండేవి. చాలా వ‌ర‌కు వీకెండ్ వినోదానికి ప్ర‌ధాన కేంద్రాలుగా అప్ప‌ట్లో వీటిని చెప్పుకునేవారు. అయితే కాల క్ర‌మేనా మ‌ల్టీప్లెక్స్‌లు రావ‌డంతో సింగిల్ వ్య‌వ‌స్థ చాలా వ‌ర‌కు క‌నుమ‌రుగవుతూ వ‌చ్చింది. అయితే 1940లోనే రెండు జంట న‌గ‌రాల్లో16 ఐకానిక్ థియేట‌ర్స్ ఉండేవి. చారిత్ర‌క సాక్ష్యాలుగా నిలిచి సినీ ప్రియుల్ని అల‌రించాయి.

టాకీ సినిమాల కాలంలో...

హైద‌రాబాద్ సినీ ల‌వ‌ర్స్‌కు టాకీ కాలంలో సినీ మాయాజాలాన్ని ప‌రిచ‌యం చేసిన థియేట‌ర్లు చాలానే ఉన్నాయి. ఈ థియేట‌ర్లు హైద‌రాబాద్ సంస్కృతిలో ఒక భాగంగా నిలిచాయి. అంతే కాకుండా న‌గ‌ర వార‌స‌త్వాన్ని, సంస్కృతిని ప్ర‌తిబింబిస్తూ అభివృద్ది చెందుతున్న చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చేయూత‌నిచ్చాయి. అప్ప‌ట్లో వినోద ప‌న్ను లేక‌పోవ‌డంతో స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే ప్ర‌జ‌లు సినిమాల‌ని ఆస్వాదించ‌డానికి అధిక సంఖ్య‌లో థియేట‌ర్ల‌కు త‌ర‌లి వ‌చ్చేవారు. దీంతో అప్ప‌ట్లో హైద‌రాబాద్‌, సింకిద్ర‌బాద్ జంట‌న‌గ‌రాల్లోని థియేట‌ర్ల వ‌ద్ద కోలాహ‌ళ‌మైన వాతావ‌ర‌ణం ఉండేది.

జంట న‌గ‌రాల్లో 16 ఐరానిక్ థియేట‌ర్లు..

హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో మొత్తం 16 థియేట‌ర్లు ఉండేవి. హైద‌రాబాద్ న‌గ‌రంలో తొమ్మిది థియేట‌ర్లు ఉంటే సికింద్రాబాద్‌లో ఏడు థియేట‌ర్లు ఉండేవి. దేనిక‌దే ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉండేవి. అయితే అవ‌న్నీ ఇప్పుడు కాల గ‌ర్భంలో క‌లిసిపోయాయి. వాటి స్థానంలో కొత్త మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్లు, డాల్బీ అట‌మాస్ స్క్రీన్‌లు వ‌చ్చేశాయి. ఒక‌ప్పుడు హైద‌రాబాద్ సినీ ప్రియుల్ని అల‌రించి వినోదాన్ని అందించిన ఐకానిక్ థియేట‌ర్స్ లిస్ట్ ఇది.

హైద‌రాబాద్ థియేట‌ర్స్ లిస్ట్‌..

1) వెస్ట్ ఉండ్ టాకీస్ -కాచీగూడ‌

2) ఎక్స్‌సెల్సియ‌ర్ టాకీస్ - అబిడ్స్ రోడ్‌.

3) జ‌మురుద్ మ‌హ‌ల్ టాకీస్ - అబిడ్స్ రోడ్‌

4) ప్యాలెస్ టాకీస్ - అబిడ్స్ రోడ్‌

5) మోతీ మ‌హ‌ల్ టాకీస్ - సుల్తాన్ బ‌జార్ మార్కెట్‌

6) రాయ‌ల్ టాకీస్ - సుల్తాన్ బ‌జార్ మార్కెట్‌

7) మిన‌ర్వా టాకీస్‌..మిన‌ర్వా థియేట‌ర్ - హైద‌రాబాద్‌

8) కృష్ణ టాకీస్ - నాంప‌ల్లి

9) కిస్మ‌త్ టాకీస్ - పుత్లీ బుడీ -హైద‌రాబాద్‌

సింకిద్రాబాద్ థియేట‌ర్స్

1) రివోలి టాకీస్ - ఆక్స్‌ఫ‌ర్డ్ స్ట్రీట్‌

2) బ్రిటీష్ టాకీస్ -బాల్ట‌న్ రోడ్‌

3) టివోలీ టాకీస్ - బాల్ట‌న్ రోడ్‌

4) రాజేశ్వ‌రీ టాకీస్ - మార్కెట్ స్ట్రీట్‌

5) మ‌నోహ‌ర్ టాకీస్ - సెయింట్ మెరీస్ రోడ్‌

6) ఇంపీరియ‌ల్ టాకీస్ - హిల్ స్ట్రీట్‌

7) గ‌ర్రియోన్ టాకీస్ - తిరుమ‌ల‌గిరి