Begin typing your search above and press return to search.

మూడేళ్ల ప్రేమకథకు స్వస్తి?

స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ -నటి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే

By:  Srikanth Kontham   |   30 Oct 2026 10:00 PM IST
మూడేళ్ల ప్రేమకథకు స్వస్తి?
X

బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ డేటింగ్ రూమర్లు ఎప్పుడూ హాట్ టాపికే. స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ -నటి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రకటించకపోయినా? ముంబై వీధుల్లో కలిసి తిరగడం.. కలిసి ఈవెంట్లకు హాజరుకావడంతో ఇద్ద‌రి రిలేషన్‌షిప్‌పై ఓ అవగాహన వచ్చింది. అయితే తాజాగా ఇద్ద‌రి బంధానికి ముగింపు పడిందనే వార్త బి టౌన్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

మూడేళ్ల డేటింగ్ అనంత‌రం ఇబ్రహీం అలీ ఖాన్- పాలక్ తివారీలు విడిపోయినట్లు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లొస్తున్నాయి. ఈ బ్రేకప్‌ను ఇబ్రహీం అలీ ఖానే ప్రతిపాదించినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. విశేషమేమిటంటే? ఈ నెల ప్రారంభంలోనే ఇద్ద‌రు రాజస్థాన్‌లోని రణథంబోర్ టైగర్ సఫారీలో కలిసి సరదాగా గడిపారు. సోషల్ మీడియాలో కూడా ఇప్పటికీ ఒకరినొకరు ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే అకస్మాత్తుగా ఇద్ద‌రు విడిపోవడానికి సంబంధించి వస్తున్న వార్తలు బాలీవుడ్ లవర్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఈ బ్రేకప్ వార్తల వెనుక ఓ ఆసక్తికరమైన కమర్షియల్ ..పబ్లిసిటీ పాయింట్ దాగి ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇబ్రహీం అలీ ఖాన్ త్వరలోనే కరణ్ జోహార్ పాపులర్ సెలబ్రిటీ టాక్ షో `కాఫీ విత్ కరణ్` సీజన్ 9లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ షోలో ఆయన అరంగేట్రంకి సంబంధించిన హైప్ దెబ్బతినకూడదని, తన పర్సనల్ లైఫ్‌లోని ఈ బ్రేకప్ వ్యవహారం షో ప్రమోషన్లను ఆధిపత్యం చేయకూడదనే ఉద్దేశంతోనే ఇబ్రహీం మీడియాకు దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

అలాగేఊ ఇద్దరూ విడిపోవడం వల్ల గతంలో ప్లాన్ చేసిన కొన్ని జాయింట్ ప్రాజెక్ట్‌లు, షూటింగ్‌లు పూర్తిగా రద్దవ్వడం జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. పర్సనల్ లైఫ్‌లో వచ్చిన బ్రేకప్ వల్ల ప్రొఫెషనల్ ప్రాజెక్ట్‌లు కూడా ప్రభావితం కావడం గమనార్హం. గతంలో ఓ ముంబై రెస్టారెంట్ బయట కనిపించినప్పుడు పాలక్ తివారీ కెమెరాల నుంచి ముఖాన్ని దాచుకోవడానికి ప్రయత్నించినప్పటి నుంచి ఇద్దరి ప్రేమకథ వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

అయితే ఇప్పటివరకు బ్రేకప్ వార్తలపై ఇబ్రహీం అలీ ఖాన్ గానీ .. పాలక్ తివారీ గానీ స్పందించలేదు. బాలీవుడ్‌లో సెలబ్రిటీల సంబంధాలు ఎంత వేగంగా చిగురిస్తాయో? అంతే వేగంగా తుదిదశకు చేరుకుంటాయనేదానికి ఈ సంఘటన మరొక ఉదాహరణగా నిలుస్తోంది. ఒకవైపు డెబ్యూ సినిమాలతో కెరీర్‌ను నిర్మించుకునే పనిలో ఉన్న యంగ్ స్టార్ కిడ్స్ వ్యక్తిగత జీవితాన్ని మీడియా దృష్టి నుంచి కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మొత్తానికి మూడేళ్ల అనుబంధానికి ముగింపు పడిందనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. టాక్ షోల హంగామా.. ప్రొఫెషనల్ కట్టుబాట్ల మధ్య యంగ్ కపుల్ బ్రేకప్‌పై ఎప్పుడు నోరు విప్పుతారో? లేదా ఇది కేవలం మీడియా సృష్టించిన ప్రచారమేనా అనేది చూడాలి.