తప్పుని నిజాయితీగా ఒప్పుకున్న స్టార్ కిడ్
సైఫ్ అలీ ఖాన్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఇబ్రహీం అలీ ఖాన్ కు స్టార్టింగ్ లో మంచి క్రేజ్ ఉండేది.
By: Sravani Lakshmi Srungarapu | 21 Oct 2025 5:00 PM ISTఇండస్ట్రీలో నెపో కిడ్స్ కు ఉండే ట్రీట్‌మెంటే వేరని, వారికి అన్నీ ఈజీగా వచ్చేస్తాయని అందరూ అనుకుంటారు. కానీ వారికుండే కష్టాలు వారికుంటాయి. బ్యాక్ గ్రౌండ్ లేని వారికి, బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికీ తేడా కేవలం ఎంట్రీ మాత్రమే. బ్యాక్ గ్రౌండ్ లేని వారికి ఇండస్ట్రీలోకి రావడమే అతి పెద్ద కష్టం. కానీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లకు అది ఉండదు. అంతే తప్పించి మిగిలింది ఏదైనా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లు సక్సెస్ అయితే ఎంతో గొప్పగా చెప్తారు, అదే వాళ్ల నుంచి వచ్చిన సినిమా ఫ్లాప్ అయితే కొత్త అయినప్పటికీ బాగానే ప్రయత్నించారు అంటారు. కానీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ల నుంచి వచ్చిన సినిమాలు అంచనాలను అందుకోలేకపోతే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి విమర్శలనే ఎదుర్కొన్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ ఇబ్రహీం అలీ ఖాన్.
ఇబ్రహీం నుంచి ఎంతో ఆశించిన ఫ్యాన్స్
సైఫ్ అలీ ఖాన్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఇబ్రహీం అలీ ఖాన్ కు స్టార్టింగ్ లో మంచి క్రేజ్ ఉండేది. చూడ్డానికి అందంగా ఉండటంతో పాటూ ఇబ్రహీంలో సైఫ్ పోలికలు కూడా ఉండటంతో కచ్ఛితంగా అతని ఎంట్రీ గ్రాండ్ గా ఉండటంతో పాటూ అదిరిపోతుందని అందరూ ఆశించారు. కానీ ఇబ్రహీం నుంచి వచ్చిన మొదటి ప్రాజెక్టు ఎప్పుడైతే ప్రేక్షకుల ముందుకొచ్చిందో, దాని రిజల్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంది.
ఆ విమర్శలు ఎంతో ప్రభావితం చేశాయి
ఇబ్రహీం అలీ ఖాన్ నటించిన మొదటి ఓటీటీ ప్రాజెక్టు నదానియన్ ఆడియన్స్ ను ఆకట్టుకోకపోగా ఆన్ లైన్ లో ట్రోలింగ్ కు గురైంది. తాజాగా ఇబ్రహీం, నదానియన్ గురించి మాట్లాడారు. నదానియన్ విషయంలో వచ్చిన విమర్శలు తనను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పిన ఇబ్రహీం, అదేమీ మంచి మూవీ కాదని, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే తాను ఆ ప్రాజెక్టును చేశానని, తప్పును చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు.
ఇబ్రహీం ఫోకస్ మొత్తం దానిపైనే!
నదానియన్ తర్వాత ఇబ్రహీం నుంచి వచ్చిన సర్జమీన్ కూడా ఆడియన్స్ నుంచి యునానిమస్ రెస్పాన్స్ ను తెచ్చుకోలేకపోయింది. దీంతో ఇబ్రహీం ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్నీ రాబోయే సినిమా డిలేర్ పై పెడుతున్నారు. డిలేర్ మూవీలో క్యారెక్టర్ కోసం తానెంతో కష్టపడ్డానని, గతంలో తన యాక్టింగ్ పై వచ్చిన కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆ లోపాలను సరిదిద్దుకున్నానని చెప్తున్నారు. దీంతో డిలేర్ మూవీ అయినా ఇబ్రహీంకు మంచి కంబ్యాక్ ను ఇస్తుందేమోనని సైఫ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
