Begin typing your search above and press return to search.

IBOMMA: 'హిట్ 3' దొంగ సొంత టీమ్‌లో లేడు.. ఐబొమ్మ రవి హ్యాకింగ్ స్కెచ్!

'హిట్ 3' సినిమా థియేటర్లలోకి రావడానికి 18 గంటల ముందే, ఆ సినిమా 'ఒరిజినల్ ఫిల్మ్ క్వాలిటీ'తో ఐబొమ్మలో ప్రత్యక్షమైంది.

By:  M Prashanth   |   18 Nov 2025 4:03 PM IST
IBOMMA: హిట్ 3 దొంగ సొంత టీమ్‌లో లేడు.. ఐబొమ్మ రవి హ్యాకింగ్ స్కెచ్!
X

'ఐబొమ్మ' రవి అరెస్ట్ తర్వాత, అతని పైరసీ సామ్రాజ్యం గురించి ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇండస్ట్రీకి వందల కోట్లు నష్టం కలిగించాడని పోలీసులు చెబుతున్నా, అసలు ఇతను ఈ పైరసీని ఎలా నడిపించాడనేది పెద్ద మిస్టరీ. అయితే, నాని 'హిట్ 3' సినిమా విషయంలో జరిగిన ఒక సంఘటన, రవి టెక్నిక్ ఎంత డేంజరస్‌గా ఉందో బయటపెట్టింది.

IBOMMA

'హిట్ 3' సినిమా థియేటర్లలోకి రావడానికి కొన్ని గంటల ముందే, ఆ సినిమా 'ఒరిజినల్ ఫిల్మ్ క్వాలిటీ'తో ఐబొమ్మలో ప్రత్యక్షమైంది. ఇది చూసి ఇండస్ట్రీ మొత్తం, ముఖ్యంగా నాని ప్రొడక్షన్ హౌస్ షాక్ అయింది. సినిమా ఇంకా థియేటర్లకే రాలేదు, ఓటీటీకి అసలే ఇవ్వలేదు.. మరి ఇంత క్లియర్ ప్రింట్, అదీ ఒరిజినల్ క్వాలిటీతో ఎలా బయటకు వెళ్లింది? అనే ప్రశ్న ఇండస్ట్రీలో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.

సహజంగా ఇలా జరిగినప్పుడు, అందరి వేళ్లూ ప్రొడక్షన్ టీమ్ వైపే చూపిస్తాయి. తమ సొంత టీమ్‌లోనే ఎవరో దొంగ ఉన్నాడని, ఉద్యోగుల్లో ఎవరో ఒకరు ఈ ఫైల్‌ను లీక్ చేసి ఉంటారని ఆ ప్రొడక్షన్ హౌస్ భావించింది. దీనివల్ల కంపెనీలో ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది, అనవసరమైన అనుమానాలు మొదలవుతాయి. 'హిట్ 3' టీమ్ కూడా కొద్దికాలం పాటు తమ వాళ్లనే అనుమానించింది.

కానీ, ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత పోలీసులు చేసిన విచారణలో అసలు నిజం బయటపడింది. 'హిట్ 3' లీక్ వెనుక "లోపలి మనిషి" లేడు. ఐబొమ్మ రవే నేరుగా ఆ సినిమా సర్వర్లను హ్యాక్ చేసి, ఫైల్‌ను దొంగిలించినట్లు పోలీసులు నిన్న నిర్ధారించారు. ఇది మామూలు పైరసీ కాదు, ఇది ఒక పక్కా 'హై లెవెల్ హ్యాకింగ్' అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.

ఇది ఇండస్ట్రీకి చాలా పెద్ద వార్నింగ్ బెల్. రవి కేవలం ఓటీటీలో వచ్చిన తర్వాత కంటెంట్‌ను కాపీ చేయట్లేదని ఈ సంఘటనతో తేలిపోయింది. ఏకంగా సినిమా రిలీజ్‌కు ముందే, ఫైనల్ ప్రింట్‌ను దాచుకునే మెయిన్ సర్వర్లనే హ్యాక్ చేసి, ఫైల్‌ను ఎత్తుకెళ్లాడు. అందుకే అతనికి కొన్ని గంటల ముందే 'ఒరిజినల్ క్వాలిటీ' దొరికింది. ఈ టెక్నాలజీతోనే అతను కోట్లు సంపాదించి ఉంటాడని అర్థమవుతోంది.

'హిట్ 3' ఉదంతం ఒకటి చాలు, ఐబొమ్మ రవి నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి. ఇన్నాళ్లూ తమ ఉద్యోగులనే అనుమానిస్తున్న ప్రొడక్షన్ హౌస్‌లకు ఇప్పుడు అసలు దొంగ ఎవరో తెలిసింది. ఈ హ్యాకింగ్ స్కెచ్ బయటపడటంతో, ఇకనైనా ఇండస్ట్రీ తమ డిజిటల్ సెక్యూరిటీని పటిష్టంగా మార్చికోవాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు.