ఐబొమ్మ రవి తెలివితేటల్ని వాడుకోండి: సీవీఎల్
నరసింహారావు ఒక సంచలన ప్రతిపాదన చేశారు. రవి లాంటి వారిని జైలుకు పంపించడం పాత పద్ధతి. అతని వద్ద ఉన్న అపారమైన టెక్నికల్ నాలెడ్జ్ ను ఇండస్ట్రీ కోసం వాడుకోవాలి.
By: M Prashanth | 23 Nov 2025 1:32 PM ISTఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత టాలీవుడ్ లోని పైరసీ సమస్యకు పరిష్కారం ఏంటనే చర్చ జరుగుతోంది. రవిని కేవలం జైల్లో పెడితే సమస్య తీరదని, అతని వద్ద ఉన్న టెక్నాలజీ జ్ఞానాన్ని పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలని న్యాయవాది సీవీఎల్ నరసింహారావు ప్రభుత్వాన్ని కోరారు. రవిని ఒక క్రిమినల్ గా చూసినా, అతని తెలివితేటలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
నరసింహారావు మాట్లాడుతూ, తాను రవికి న్యాయ సలహా ఇవ్వాలని మాత్రమే అనుకుంటున్నానని, కానీ ఎక్కడ కూడా తానే అతని అడ్వకేట్‌నని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ కేసును నిజం ఏంటో బయటకు తీసుకురావడానికి ఒక అవకాశంగా చూస్తున్నానని చెప్పారు. రవి చేసిన పని తప్పు కావచ్చు, కానీ దొంగను దొంగగానే చూడాలి తప్ప, రాబిన్ హుడ్‌గా చూడకూడదని ప్రజలకు హితవు పలికారు.
న్యాయం ప్రకారం కసబ్ లాంటి వారికి కూడా లీగల్ సపోర్ట్ దొరికిందని ఆయన గుర్తు చేశారు. ఆయన ఇండస్ట్రీలోని నిర్మాతల వైఖరిని సూటిగా తప్పుబట్టారు. నిర్మాతలు తమ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి టెక్నాలజీ వాడరు. సినిమా ఇండస్ట్రీలోని కార్మికులు చాలా నష్టపోయారు. 3,400 కోట్ల నష్టం వచ్చిందని చెబుతున్నా, ఎవరెవరికి ఎంత నష్టం వచ్చిందో వివరాలు ఇస్తూ ఎఫ్‌ఐఆర్‌లు ఎందుకు దాచిపెడుతున్నారు అని ఆయన ప్రశ్నించారు.
నరసింహారావు ఒక సంచలన ప్రతిపాదన చేశారు. రవి లాంటి వారిని జైలుకు పంపించడం పాత పద్ధతి. అతని వద్ద ఉన్న అపారమైన టెక్నికల్ నాలెడ్జ్ ను ఇండస్ట్రీ కోసం వాడుకోవాలి. రవిని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకుని సైబర్ క్రైమ్ నిపుణుడిగా ఉపయోగించుకోవాలి. దీనికోసం ప్లీ బార్గేనింగ్ ద్వారా శిక్షను తగ్గించి ప్రభుత్వ సేవ చేసే అవకాశం ఇవ్వాలి.
రవి టాలెంట్ ను వాడుకుంటే సైబర్ నేరాలు తగ్గుతాయి తెలంగాణ ఒక బంగారు తెలంగాణలా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జైల్లో శిక్ష అనుభవించినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదు. కానీ సమస్య మూలం తెలిసిన వ్యక్తిని సొల్యూషన్ టీమ్ లో భాగం చేస్తే అది పెద్ద విజయం అవుతుంది.
మొత్తానికి, నరసింహారావు చెప్పిన ఈ స్మార్ట్ ప్లాన్ చాలా పవర్ ఫుల్. రవిని దొంగగా శిక్షించడం కంటే, అతని టాలెంట్ ను పోలీసుల పర్యవేక్షణలో దేశం కోసం వాడుకోవడం ఎక్కువ లాభం అని ఆయన చెప్పడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం ఈ కొత్త ఆలోచనను పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే పైరసీ సమస్య కొనసాగుతూనే ఉంటుందని మరికొందరు చెబుతున్నారు.
