IBOMMA రవి ఇన్ని ట్విస్టులేంటి బాబోయ్
ఐబొమ్మ రవి అరెస్ట్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు మతులు చెడగొడుతున్నాయి. ఈ ట్విస్టులు హాలీవుడ్ సినిమా స్క్రీన్ ప్లే కి తక్కువేమీ కాదు!
By: Sivaji Kontham | 26 Nov 2025 10:34 PM ISTఅతడు ఫ్రాడ్ స్టర్ల నుంచి మాత్రమే డబ్బు వసూలు చేసాడు.. అతడు పైరసీ ఎప్పుడూ నేరుగా చేయలేదు!.. ఇదీ ఐబొమ్మ రవిపై తాజా తాజా అప్ డేట్. ఇది నిజంగా షాకింగ్ గా లేదూ? వివరాల్లోకి వెళితే.....
ఐబొమ్మ రవి అరెస్ట్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు మతులు చెడగొడుతున్నాయి. ఈ ట్విస్టులు హాలీవుడ్ సినిమా స్క్రీన్ ప్లే కి తక్కువేమీ కాదు! నిజానికి అతడిని పైరసీ నేరం కింద పోలీసులు అరెస్ట్ చేసారు. కానీ అతడు పైరసీ చేయలేదు! పోలీసుల తాజా వివరాల ప్రకారం.. ఐబొమ్మ రవి నేరుగా సినిమాలను పైరసీ చేయలేదు. అతడు పైరసీ సైట్ల నుంచి సినిమాలు, షోలను కొనుక్కున్నాడు అంతే! అంతగా నాణ్యత లేని పైరసీ సినిమాలను కొనుగోలు చేసి వాటి క్వాలిటీని హెచ్.డిలోకి మార్చేందుకు సాంకేతికతను ఉపయోగించాడు. టెలీగ్రామ్, మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీ లాంటి పైరసీ సైట్ల నుంచి అతడు సినిమాలను కొనుగోలు చేసాడు. టెక్నాలజీతో హెచ్.డిలోకి మార్చిన సినిమాలను ఐబొమ్మ, బప్పం సైట్లలో అప్ లోడ్ చేసేవాడు. అక్కడ ప్రకటనల ద్వారా ఆదాయం ఆర్జించాడు.
దాదాపు 21వేల పైరసీ సినిమాల డేటాను ఐబొమ్మ రవి సమీకరించాడని పోలీసులు చెబుతున్నారు. అతడు ఇంత పెద్ద డేటాను ఉపయోగించుకుని, ఏకంగా 20కోట్లు సంపాదించాడని కూడా చెబుతున్నారు. ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్లలో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం ద్వారా అతడు డబ్బు సంపాదించాడు. నిజానికి అతడు ఫ్రాడ్ స్టర్ల నుంచి మాత్రమే డబ్బు వసూలు చేసాడు. ఇప్పటివరకూ పోలీసులు గేమింగ్ బెట్టింగ్ పేరుతో ప్రజలను మోసం చేసి డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లను అరెస్ట్ చేయలేదు. కేవలం విచారణలు మాత్రమే సాగిస్తున్నారు.
ఐబొమ్మ రవి కేసులో హవాలా మార్గంలో డబ్బు తరలింపుపైనా ఆరాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈడీ రవిని కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఐదురోజుల కస్టడీ ముగించిన పోలీసులు మరోసారి విచారించేందుకు కోర్టు అనుమతి కోరారు. ఇక ఐబొమ్మ రవికి మొత్తం 35 అకౌంట్లు ఉన్నాయని, వాటన్నిటినీ ఫ్రీజ్ చేసామని పోలీసులు చెబుతున్నారు. తప్పుడు మార్గాల్లో ఆర్జించిన కోట్లాది రూపాయలను అతడు ప్రపంచ దేశాల యాత్రల కోసం ఖర్చు చేసాడని కూడా పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
