పోలీసులకే ఐబొమ్మ స్ట్రాంగ్ కౌంటర్.. చేతనైతే పట్టుకోండి అంటూ!
ఇండియాలో అతిపెద్ద పైరసీ యాప్ ఐబొమ్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 1 Oct 2025 4:40 PM ISTఇండియాలో అతిపెద్ద పైరసీ యాప్ ఐబొమ్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా థియేటర్లలోకి సినిమా అలా వచ్చిందో లేదో అప్పుడే ఐబొమ్మ వెబ్సైట్లో ఆ సినిమా కనిపిస్తుంది. అంతలా సినిమాను దొంగలిస్తున్న ఇలాంటి పైరసీ యాప్స్ వల్ల సినిమా ఇండస్ట్రీ, సినిమా నటీనటులు ఎంతలా నష్టపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ నేపథ్యంలోనే ఈ పైరసీని అరికట్టడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నడుం బిగించారు. అందులో భాగంగానే సుమారుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, అధునాతన పరికరాలను ఉపయోగించి, దేశంలో అతిపెద్ద పైరసీ ముఠాను పట్టుకున్నారు. పైగా నలుగురిని అరెస్టు కూడా చేశారు. త్వరలోనే ఐబొమ్మ హెడ్ ని కూడా పట్టుకుంటాం అంటూ తెలంగాణ ఐపీఎస్ అధికారి CV ఆనంద్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే ఐపీఎస్ CV ఆనంద్ ప్రకటనను సవాల్ చేస్తూ.. ఐబొమ్మ ఒక నోట్ విడుదల చేసినట్టుగా ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
నోట్ లో ఏముంది అనే విషయానికి వస్తే.. "ఫస్ట్ కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే సైట్లపైన మీ దృష్టి పెట్టండి. మా సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు మేం బయటపెడతాము. ఐదు కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇండియా మొత్తం మాకు సపోర్టు ఉంది. తగ్గేది లేదు.. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశంలో తెలుగు వాళ్ల కోసమే ఆలోచిస్తాము.. మా వెబ్సైట్ మీద మీరు ఫోకస్ చేయడం ఆపండి. లేదంటే మేము మీ మీద ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాము" అంటూ తెలిపినట్లు .. నిన్న పోలీసులు చేసిన ప్రకటనకు ధీటుగా ఈ పోస్టును సర్కులేట్ చేస్తున్నారు.
అయితే నిజంగా ఐబొమ్మ ఈ పోస్ట్ పెట్టిందా అనే విషయానికి వస్తే.. నిజాలు ఆరా తీయగా . 2023లోనే అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. ఐబొమ్మ ఈ పోస్టును విడుదల చేసినట్లుసమాచారం. అయితే నిన్న తెలంగాణ ఐపీఎస్ సివి ఆనంద్ త్వరలోనే ఐబొమ్మ హెడ్ ను పట్టుకుంటామంటూ ప్రకటన జారీ చేయడంతోనే కొంతమంది గతంలోని ఐబొమ్మ పోస్టును ఇప్పుడు వైరల్ చేస్తూ ఐబొమ్మ పోలీసులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఐబొమ్మ హెడ్ ను పట్టుకోవడానికి చాలా దగ్గరలోనే ఉన్నారు. ఇప్పటికే హైటెక్నాలజీని ఉపయోగించి సైబర్ ముఠాను పట్టుకున్నామని తెలిపారు కాబట్టి.. ఐబొమ్మ హెడ్ ను పట్టుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
వాస్తవానికి ఈ పైరసీల వల్ల సినిమా ఇండస్ట్రీకి జరిగే నష్టం అటు ఉంచితే.. ఈ పైరసీ వెబ్ సైట్ లు బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నాయి.. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులను టెర్రరిజానికి స్పాన్సర్ చేస్తున్నారు. ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతోంది. కాబట్టి ఈ పైరసీ వెబ్సైట్లను ప్రోత్సహించకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమాను థియేటర్లలోనే చూసి.. ఆ ఎక్స్పీరియన్స్ అనుభవిస్తేనే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
