Begin typing your search above and press return to search.

స్టేజ్ పై కుప్పకూలిన పాప్ సింగర్.. ఆమె పరిస్థితి చూసి డాక్టర్లకే షాక్!

ఈ క్రమంలోనే ఇప్పుడు దక్షిణ కొరియా పాప్ సంచలనం హ్యూనా (32) గురించి సంగీత ప్రియులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Madhu Reddy   |   11 Nov 2025 2:00 PM IST
స్టేజ్ పై కుప్పకూలిన పాప్ సింగర్.. ఆమె పరిస్థితి చూసి డాక్టర్లకే షాక్!
X

చాలామంది సెలబ్రిటీలకి ఎంత ఏజ్ అయినా కూడా అందంగా కనిపించాలని ఆత్రుత ఉంటుంది. అలానే ఆహార అలవాట్ల విషయంలో కూడా చాలా తూకం వేసుకొని తింటుంటారు. ముఖ్యంగా వయసులో ఉన్నప్పుడు ఏదైనా చేసేయాలి అని అంటూ ఉంటారు. అయితే వయసు కనిపించకుండా ఉండడానికి పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటారు కొంతమంది సెలబ్రిటీస్. దానివలన కంటికి కనిపించని రోగాలు లో లోపల అవయవాల్లో ఏర్పడుతుంటాయి.

ఈరోజుల్లో ఎప్పుడు ఎవరికీ ఏం జరుగుతుంది అని ఊహించలేము. చూడడానికి బయటకు బాగా కనిపించినా కూడా లోలోపల ఏవో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. హాస్పిటల్లో డాక్టర్లు మీకు ఇది ఉంది అని చెప్పినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. చాలామంది బరువు తగ్గడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్ తను బరువు తగ్గే ప్రాసెస్ లోనే ప్రాణాలను కూడా కోల్పోయారు.

స్టేజ్ పై కుప్పకూలిన పాప్ సింగర్

ఈ క్రమంలోనే ఇప్పుడు దక్షిణ కొరియా పాప్ సంచలనం హ్యూనా (32) గురించి సంగీత ప్రియులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎన్నో ఈవెంట్స్ లో తన ప్రతిభను చూపించి చాలామందిని ఉర్రూతలూగించింది.

తాజాగా మకావులో జరిగిన WATERBOMB 2025 సంగీత ఉత్సవంలో ఉన్నట్టుండి వేదికపైనే కుప్ప కూలిపోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అసలు పాప్ స్టార్ ఆరోగ్యానికి ఏమైందనే ఆందోళనలో పడిపోయారు అభిమానులు. అలా పర్ఫామెన్స్ ఇస్తూ వేదిక పైన కుప్పకూలిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో గమనిస్తే పడిపోయిన వెంటనే అది ఒక పర్ఫామెన్స్ లో భాగం కాబోలు అనుకున్నారు. కానీ అప్పటికి అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా అరుస్తూనే ఉన్నారు.

కొద్దిసేపటికి అది నిజంగా జరిగింది అని తేలుకున్న తర్వాత హుటాహుటిన ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వచ్చి ఆమెను చేతులతో ఎత్తుకొని తీసుకెళ్లిపోయారు. ఇక హాస్పిటల్ లో చేరిన తర్వాత షాకింగ్ విషయాలను డాక్టర్ రివీల్ చేశారు.

అతి తక్కువ కాలంలో అంత మార్పు..

వైవాహిక జీవితం తర్వాత ఆడపిల్లలో మార్పు రావడం అనేది సహజంగా జరుగుతుంది. అదే హ్యూనాకు కూడా జరిగింది. అయితే ఈ మధ్యకాలంలోనే తాను డైటింగ్ ద్వారా బాగా బరువు తగ్గినట్టు తెలిపింది హ్యునా. వివాహం తర్వాత తాను స్ట్రిక్ట్ డైట్లో ఉన్నానని, కేవలం 30 రోజుల్లోనే 10 కిలోగ్రాములు (22 పౌండ్లు) బరువు తగ్గినట్లు తెలియజేసింది.

మితంగా ఆహారం తీసుకోవడం అనేది మంచి పద్ధతి. కానీ 30 రోజుల్లోనే 10 కేజీలు తగ్గటం అనేది ఆశ్చర్యకరం. ఆ విషయం తెలుసుకున్న డాక్టర్స్ కూడా షాక్ అయ్యారు. ఉన్నఫలంగా బరువు తగ్గడం వల్లనే ఆవిడకు అలా జరిగింది అనే క్లారిటీ డాక్టర్లకు కూడా వచ్చేసింది. మొత్తానికి ప్రస్తుతం తన పరిస్థితి బానే ఉంది అని హ్యూనా తెలిపారు. ఇకనైనా తన ఆహారపు అలవాట్ల విషయంలో చేంజెస్ చేసుకొని అభిమానులకు దగ్గరవుతుందేమో చూడాలి.