సినిమాలు ప్రజల్లో విద్వేషాన్ని పెంచకూడదు
తనదైన అందం, ప్రతిభతో సరిహద్దులు దాటి నిరూపించిన నటి హ్యూమా ఖురేషి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఈ భామ సుపరిచితురాలు.
By: Sivaji Kontham | 22 Nov 2025 9:22 AM ISTతనదైన అందం, ప్రతిభతో సరిహద్దులు దాటి నిరూపించిన నటి హ్యూమా ఖురేషి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఈ భామ సుపరిచితురాలు. ఇటీవల వరుస వెబ్ సిరీస్ లలో అద్భుత పాత్రలతో యువతరం హృదయాలను గెలుచుకుంటున్న హ్యూమా ఖురేషి తన ఎంపికలు ఎప్పుడూ విలువలతో కూడుకున్నవి అని ధృవీకరించింది.
ఏదైనా సినిమా ప్రజల్లో ద్వేషాన్ని పెంచితే అది హానికరమైనది. ప్రజల సమస్యలను మనం పెంచకూడదు. వినోదాన్ని మాత్రమే పంచాలి! అని అన్నారు. తాను ఏదైనా స్క్రిప్టును ఎంచుకోవాలంటే కచ్ఛితంగా కొన్ని విలువలకు కట్టుబడి ఉంటానని హ్యూమా చెప్పకనే చెప్పింది. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, మహారాణి, హీరా మండి ఒకటేమిటి కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన హ్యూమా, ప్రస్తుతం ఢిల్లీ క్రైమ్ సీజన్ 3లోను నటించింది.
ఒక కథను ఎంపిక చేసుకుని సంతకం చేసే ముందు దానిపై నమ్మకం ఉంచాలా? అని అడిగినప్పుడు, పెద్ద చెక్కులు ఇస్తారు కదా! అంటూ జోక్ చేసింది. కానీ తనకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పింది.
ఏదైనా ఎంచుకోవడానికి డబ్బు ఒక్కటే ప్రామాణికం కాదని కూడా హ్యూమా వెల్లడించింది.
తాను విలువలకు ఎలా కట్టుబడి ఉంటుందో హ్యూమా చెప్పకనే చెప్పింది. తన సిద్ధాంతాలతో అందరి హృదయాలను గెలుచుకుంది. నంబర్ల గేమ్ నడిచే పరిశ్రమలో విలువలకు కట్టుబడి ఉండేది చాలా తక్కువమంది. ఇప్పుడు హ్యూమా నిర్మాతగాను కొన్ని సినిమాలను విలువలకు కట్టుబడి నిర్మిస్తోంది. తాజా పాడ్ కాస్ట్ లో హ్యూమా తన తదుపరి రిలీజ్ గురించి మాట్లాడింది.
నిర్మాతగా ఆవేదన...
ఇటీవలే థియేటర్లలో విడుదలైన విమర్శకుల ప్రశంసలు పొందిన `ఆగ్రా` చిత్రానికి ప్రజల్లో సరైన ఆదరణ దక్కలేదని, తాను నిర్మించిన `సింగిల్ సల్మా` కూడా ఇలాంటి విధిని ఎదుర్కొందని తెలిపింది హ్యూమా. కను బెహ్ల్ తెరకెక్కించిన `ఆగ్రా` చిత్రానికి విస్తృత ప్రశంసలు దక్కినా కానీ తగినన్ని స్క్రీన్‌లను పొందడంలో ఇబ్బంది పడింది. ఈ సమస్య దీనికి మాత్రమే కాదు చాలా మందికి ఇదే సమస్య. పరిమిత స్క్రీన్‌లు, వేకువ ఝాము షోలు తక్కువ మంది ప్రేక్షకులతో వీక్ డేస్ స్లాట్‌లను పొందుతున్నాయి. ఇటీవల ఎక్స్‌ప్రెస్సో 10వ ఎడిషన్‌లో, నటి-నిర్మాత హుమా ఎస్ ఖురేషి తన చిత్రం సింగిల్ సల్మా విధి గురించి మాట్లాడారు.
సింగిల్ సల్మా సినిమాను చాలా మంది చూడలేకపోయారు. దీన్ని నిజంగా ప్రమోట్ చేయలేదు.. దానిపై మార్కెటింగ్ ఖర్చు కూడా చేయలేదు.. కనీస ఖర్చు కూడా చేయలేదు. ఇప్పుడు అది స్ట్రీమర్‌లో వస్తుందని భావించినందున నిజమైన బజ్ లేకుండా పోయింది. మౌత్ టాక్ కూడా లేదు అని తెలిపింది
