Begin typing your search above and press return to search.

కోటి పైగా ఫాలోవ‌ర్లు.. కోట్ల‌లో సంపాద‌న‌.. ఈ అందాల న‌టి రేంజే వేరు!

ట్యాలెంటెడ్ హ్యూమా ఖురేషి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాలీవుడ్ తో పాటు ద‌క్షిణాదికి ఈ భామ సుప‌రిచితం.

By:  Sivaji Kontham   |   22 July 2026 9:46 AM IST
కోటి పైగా ఫాలోవ‌ర్లు.. కోట్ల‌లో సంపాద‌న‌.. ఈ అందాల న‌టి రేంజే వేరు!
X

ట్యాలెంటెడ్ హ్యూమా ఖురేషి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాలీవుడ్ తో పాటు ద‌క్షిణాదికి ఈ భామ సుప‌రిచితం. న‌టిగా ఎన్నో సంచ‌ల‌న చిత్రాల‌లో అద్బుత ప్ర‌ద‌న్శ‌న‌ల‌తో మెప్పించారు. వీట‌న్నిటినీ మించి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ వ్యాల్యూను ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 10.2 మిలియన్లకు పైగా (కోటికి పైగా) ఫాలోవర్లను కలిగి ఉన్న హ్యూమా.. తన ఖాతాను కేవలం వ్యక్తిగత అప్‌డేట్ల కోసమే కాకుండా బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్, మూవీ ప్రమోషన్లు, ప్రొడక్ట్ కొలాబరేషన్లకు వేదికగా ఉపయోగిస్తున్నారు. పివిఆర్ పిక్చర్స్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రమోషనల్ రీల్స్-బ్యాక్‌రూమ్స్ వంటివి.. అలాగే ప్రముఖ పోడ్‌కాస్ట్‌లతో కాంబో పోస్ట్‌ల(పీజీఎక్స్ రా అండ్ రియ‌ల్ వంటివి) తో బ్రాండ్‌లను డిజిటల్ ప్రొఫైల్‌లో ప్రమోట్ చేస్తున్నారు.

సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీల డిజిటల్ ఛార్జీల ప్రామాణికత‌ ప్రకారం... హ్యూమా ఖురేషి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో యాడ్-ప్రమోషనల్ పోస్ట్ లేదా రీల్ కోసం 15 లక్షల నుండి 25 లక్షల వరకు చార్జ్ చేసే అవకాశం ఉంది. బ్రాండ్ ఒప్పందాల సరళిని బట్టి నెలకు 2 నుండి 3 ప్రమోషనల్ పోస్టులు చేస్తే... ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే నెలకు 30 లక్షల నుండి 50 లక్షల వరకు ఆర్జిస్తారు. ఈ లెక్కన కేవలం ఇన్‌స్టాగ్రామ్ బ్రాండ్ కొలాబరేషన్ల ద్వారానే ఏడాదికి 4 కోట్ల నుండి 6 కోట్ల వరకు ఆదాయం పొందుతున్నారని అంచనా.

ట్విట్టర్ (X) వేదిక‌ విషయానికి వస్తే..అక్కడ ఉన్న ఫాలోయింగ్ - రీచ్ ఆధారంగా ఒక ప్రమోషనల్ పోస్ట్‌కు లేదా ట్వీట్‌కు హ్యూమా ఖురేషి 3 లక్షల నుండి 5 లక్షల వరకు తీసుకుంటార‌ని అంచ‌నా. ఎక్స్ ద్వారా నెలకు సుమారు 8 లక్షల నుండి 15 లక్షల వరకు..అలాగే ఏడాదికి దాదాపు 1 కోటి నుండి 1.5 కోట్ల వరకు.. డిజిటల్ ప్రమోషన్ల ద్వారా ఆర్జించే అవకాశం ఉంది.

హ్యూమా ఖురేషి సినీ పారితోషికం విషయానికి వస్తే.. త‌ను లీడ్ పాత్ర‌లో నటించే బాలీవుడ్ చిత్రాలకు అలాగే భారీ ఓటీటీ ప్రాజెక్ట్‌లకు (ఉదాహరణకు 'మహారాణి' సిరీస్) ఒక్కో ప్రాజెక్ట్‌కు 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక 2026లో హ్యూమా నటించిన, నటిస్తున్న సినిమాల జాబితా చాలా బిజీగా ఉంది. జూలై 3న విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ 'బేబీ డో డై డో' థియేటర్లలో ఆక‌ట్టుకుంది. త‌దుప‌రి యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` లో హ్యూమా ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇవే కాకుండా 'గులాబి', 'బయాన్', 'పూజా మేరీ జాన్' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే `మహారాణి` తదుపరి సీజన్‌లతో పాటు 'ఢిల్లీ క్రైమ్ 3' షూటింగ్ పనుల్లోను ఈ బ్యూటీ బిజీగా ఉన్నారు.

ఇక ద‌క్షిణాది సినిమాల విషయానికి వస్తే.. హ్యూమా ఖురేషి నేరుగా తెలుగులో పూర్తి స్థాయి కథానాయికగా ఏ స్ట్రెయిట్ తెలుగు చిత్రంలోనూ నటించలేదు. అయితే తమిళంలో రజినీకాంత్ సరసన నటించిన 'కాలా', అజిత్ 'వాలిమై' చిత్రాల‌లో న‌టించింది. త్వ‌ర‌లో విడుద‌ల‌కు వస్తున్న 'టాక్సిక్' చిత్రంపై భారీ హోప్స్ పెట్టుకుంది. ఈ మూవీ కోసం 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.