Begin typing your search above and press return to search.

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

మొత్తానికైతే హుమా లుక్ చూసిన నెటిజన్స్ ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తే కుర్రాళ్ళు ఏమైపోవాలి అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   4 Nov 2026 9:49 AM IST
రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?
X

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకవైపు సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరొకవైపు గ్లామర్ తో కట్టిపడేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రోజుకో ఫోటోషూట్ తో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.ఇలా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఎంతో మంది సెలబ్రిటీలు ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీలపై కూడా దర్శనం ఇస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా మంచి పేరు సొంతం చేసుకున్న హుమా ఖురేషి తాజాగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

జీక్యూ ఇండియా హీరోస్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజులలో ఈమె రెబల్ లుక్ చూసి కుర్రాళ్ళు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఫీబీ ఫిలో రూపొందించిన ఓవర్ సైజ్డ్ బ్లాక్ లెదర్ జాకెట్ ధరించిన ఈమె దీనికి కాంబినేషన్లో వార్డుబోర్డు ఎన్. వై.సీ.బ్రాండ్ కు చెందిన సింపుల్ అండ్ స్లీక్ లెగ్గింగ్ ధరించింది. ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా అవుట్ హౌస్ జువెలరీ కలెక్షన్ నుండి వచ్చిన ఇండస్ట్రియల్ స్టైల్ మెటల్ లింక్ లాంగ్ నెక్లెస్ ధరించి తన మేకోవర్ను ఫుల్ ఫీల్ చేసుకుంది.ముఖ్యంగా జీ క్యు ఇండియా హీరోస్ ఫోటోలకు సంబంధించిన ఈ బోల్డ్ అండ్ స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మొత్తానికైతే హుమా లుక్ చూసిన నెటిజన్స్ ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తే కుర్రాళ్ళు ఏమైపోవాలి అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అమ్మడి అందం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ప్రముఖ బాలీవుడ్ నటిగా పేరు దక్కించుకున్న ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ మొదలుపెట్టింది. 2012లో 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' అనే చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. హిందీతో పాటు తమిళ్,మరాఠీ, కన్నడ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే చివరిగా కన్నడ సినీ నటుడు యశ్ హీరోగా మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ - ఇంగ్లీషు ద్విభాష చిత్రమైన టాక్సిక్ లో ఎలిజిబెత్ అనే విలన్ పాత్ర పోషించింది. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు.

ఇందులో హుమా ఖురేషి తో పాటు నయనతార , కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 1940 నాటి గోవా నేపథ్యంలో సాగే భారీ బడ్జెట్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. దీనికి తోడు హిందీలో పూజ మేరీ జాన్ అనే చిత్రంలో కూడా నటించింది. ఏది ఏమైనా ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూ.. మరొకవైపు ఇలా గ్లామర్ అందాలు ఆరబోస్తూ అభిమానులకు మరింత చేరువ అవుతోంది.