ప్రియుడితో హూమా ఖురేషి నిశ్చితార్థం?
ఏడాది కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇండస్ట్రీలో చాలాసార్లు కలిసి కనిపించారు. ముఖ్యంగా సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ వివాహంలో జంటగా కనిపించారు.
By: Sivaji Kontham | 16 Sept 2025 8:03 PM ISTహిందీ చిత్రసీమలో పలు బ్లాక్ బస్టర్లలో నటించిన హూమా ఖురేషి, టాలీవుడ్, కోలీవుడ్ లోను నటించిన సంగతిత తెలిసిందే. అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన `గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్` చిత్రంలో అద్భుత నటనతో మనసులు గెలుచుకున్న తర్వాత నటిగా కెరీర్ పరంగా ఎదురే లేకుండా దూసుకెళ్లింది. `కాలా` చిత్రంలో హ్యూమా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అవకాశం అందుకుంది. తెలుగులోను గోపిచంద్ చిత్రంలోను నటించింది.
హూమా బాలీవుడ్ లో కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో సడెన్ గా తన నిశ్చితార్థం పూర్తయిందంటూ వార్తలు వస్తున్నాయి. హూమా తన ప్రియుడు, యాక్టింగ్ కోచ్ రచిత్ సింగ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. అమెరికాలో జరిగిన ఒక వేడుకలో రచిత్ హుమాకు ప్రపోజ్ చేశాడని, అతడి ప్రపోజల్‌కు సంతోషంగా అవును అని చెప్పిందని తెలుస్తోంది.
ఏడాది కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇండస్ట్రీలో చాలాసార్లు కలిసి కనిపించారు. ముఖ్యంగా సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ వివాహంలో జంటగా కనిపించారు. ఆ సమయంలో ఇద్దరి సంబంధం గురించి ఊహాగానాలు కొనసాగాయి. హూమా-రచిత్ జంట గురించి ఆకాశా సింగ్ సోషల్ మీడియాలో అభినందన పోస్ట్‌ను షేర్ చేసిన తర్వాత నిశ్చితార్థంపై పుకార్లు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఈ అందమైన జంట తమ నిశ్చితార్థం గురించి అధికారికంగా ధృవీకరించలేదు. కానీ తమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
రచిత్ సింగ్ ఒక ప్రఖ్యాత నటశిక్షకుడు. ఆయన బాలీవుడ్‌లో ప్రముఖ తారలకు నటశిక్షణను అందించారు. అలియా భట్, రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, అనుష్క శర్మ, సైఫ్ అలీ ఖాన్ వంటి అగ్ర తారలకు శిక్షణ అందించారు. ఇటీవలే కర్మ కాలింగ్ లో అతడు నటుడిగాను ఆరంగేట్రం చేసాడు. రవీనా టాండన్ దీనిని నిర్మించారు. హూమా తదుపరి జాలీ ఎల్.ఎల్.బి 3 - పూజా మేరీ జాన్ చిత్రాలలో కనిపించనుంది. `బయాన్ టొరంటో` అనే చిత్రంలోను హూమా నటించగా, దీనిని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రదర్శించారు. హూమా నటనకు ప్రశంసలు దక్కాయి.
