ఈద్ వస్తే వంటగదిలోనే చెమటతో స్నానమే!
ఇస్లామిక్ పవిత్ర పండుగ అయిన ఈద్-ఉల్-మిలాద్-ఉన్-నబీ -2026 సందర్భాన్ని పురస్కరించుకొని బాలీవుడ్ నటి హుమా ఖురేషి తన వ్యక్తిగత అభిప్రాయాలను, పండుగ విశేషాలను పంచుకున్నారు.
By: Srikanth Kontham | 26 Aug 2026 5:00 PM ISTఇస్లామిక్ పవిత్ర పండుగ అయిన ఈద్-ఉల్-మిలాద్-ఉన్-నబీ -2026 సందర్భాన్ని పురస్కరించుకొని బాలీవుడ్ నటి హుమా ఖురేషి తన వ్యక్తిగత అభిప్రాయాలను, పండుగ విశేషాలను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న వేళ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ప్రత్యేకమైన పవిత్ర దినం ప్రాముఖ్యతను గురించి హుమా ఖురేషి చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈద్ పండుగ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కమ్మనైన వంటకాలే అని అభిప్రాయపడ్డారు. ఈద్ వేడుకల్లో ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, అది పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి పండుగను జరుపుకోవడం తనకు ఎంతో ఇష్టమని, ఆ సమయంలో ఇంట్లో చేసే పిండి వంటలు, ప్రత్యేక భోజనాలు ఎప్పటికీ మరువలేని అనుభూతిని ఇస్తాయని గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి నుంచి పండుగలను కుటుంబసభ్యులు , స్నేహితులతో కలిసి ఆస్వాదించానని హ్యూమా తెలిపారు.
పండుగ రోజుల్లో రకరకాల వంటకాలు వండటం, వాటిని ఇరుగుపొరుగు వారికి, బంధువులకు పంచడం ముస్లిం సంప్రదాయంలో ముఖ్యమైన భాగమన్నారు. ఈద్-ఉల్-మిలాద్-ఉన్-నబీ రోజున ప్రత్యేకంగా తయారు చేసే రుచికరమైన వంటకాలు అందరినీ ఒక్కచోట చేర్చుతాయని.. ఆ ప్రేమ పూర్వక వాతావరణమే పండుగ అసలైన సంతోషమని వెల్లడించారు. ఆ సమయంలో సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా? పండుగ సమయానికి మాత్రం కుటుంబంతో గడపడానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని హుమా స్పష్టం చేశారు.
వంటగదిలో స్వయంగా తానే ప్రత్యేకమైన వంటకాలు చేయడానికి ప్రయత్నిస్తానని, కుటుంబ సభ్యుల రుచి చూసే క్షణాలు తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని సంతోషంగా చెప్పొకొచ్చారు. ఆ ఒక్క రోజు మాత్రం ఎవరికి ఏ వంటకాలు కావాలో? తానే స్వయంగా చేస్తానన్నారు. రకరకాల పిండి వంటలు..నాన్ వెజ్ వంటకాల ప్రిపరేషన్ తో బాగా అలిసి పోతానన్నారు. వంటగదిలో తన రూపం పూర్తిగా మారిపోతుందని..చెమట పట్టి జిడ్డు తో కనిపి స్తానన్నారు. ఆ రోజు ప్రత్యేకంగా వంట వాళ్లకు..ఇంట్లో పనిచేసే వాళ్లకు సెలవు ఇస్తానన్నారు.
ఎన్ని పనులైనా తానే స్వయంగా చేసుకుంటానన్నారు.హోదాను పక్కన పెట్టి సాధారణ కుటుంబ సభ్యురాలిగా హ్యూమా పండుగను ఆస్వాదించే విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. సమాజంలో శాంతి, ఐక్యత, సోదరభావం పరిఢవిల్లాలని ఈ పండుగ నేర్పుతుందని హుమా ఖురేషి పేర్కొన్నారు. ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పేదలకు సహాయం చేయడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ పవిత్ర దినాన అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.
