Begin typing your search above and press return to search.

హృతిక్ (X) సాబా: ప‌రిపూర్ణ ప్రేమ‌కు నిర్వ‌చ‌నం

సాబాతో అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఫోటోల‌ను హృతిక్ షేర్ చేసాడు. ``మీతో జీవితాంతం నడవడం నాకు ఇష్టం`` అని దీనికి క్యాప్ష‌న్ రాసాడు.

By:  Sivaji Kontham   |   1 Oct 2025 11:15 PM IST
హృతిక్ (X) సాబా: ప‌రిపూర్ణ ప్రేమ‌కు నిర్వ‌చ‌నం
X

అత‌డు ఆమెను మ‌న‌సారా ప్రేమించాడు. ఆమె సాంగ‌త్యంలో అన్ని క‌ష్టాల‌ను మ‌రిచిపోయి ఆనందంగా ఉన్నాడు. ఆమె అత‌డిని వీడి క్ష‌ణ‌మైనా ఉండ‌లేదు. అనుక్షణం అత‌డి కోస‌మే ఆత్రంగా ఎదురు చూస్తుంది. ఇలాంటి అరుదైన ప్రేమ ఈ సెల‌బ్రిటీ జంట‌లో అభిమానుల‌కు క‌నిపించింది. ఈ జంట మ‌రెవ‌రో కాదు.. హృతిక్ రోష‌న్ - సాబా ఆజాద్ జోడీ.

సాబా ఆజాద్ ని ప్రొఫెష‌న‌ల్ గా ఎంతో ఎంక‌రేజ్ చేసే హృతిక్ రోష‌న్ చాలా సంద‌ర్భాల్లో త‌న‌పై ప్రేమ కురిపించేందుకు వెన‌కాడ‌లేదు. సాబా ఆజాద్ అత‌డి సాంగ‌త్యంలో ఎంత‌గా మైమ‌రిచిపోతుందో ప్ర‌ద‌ర్శించే చాలా ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు హృతిక్ రోషన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త మైలురాయిని చేరుకున్నాడు. బుధవారం తన స్నేహితురాలు సబా ఆజాద్‌తో తన నాల్గవ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ఒక‌ హృద్యమైన పోస్ట్‌ను షేర్ చేసాడు.

సాబాతో అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఫోటోల‌ను హృతిక్ షేర్ చేసాడు. ``మీతో జీవితాంతం నడవడం నాకు ఇష్టం`` అని దీనికి క్యాప్ష‌న్ రాసాడు. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజ‌నులు, అభిమానులు ఇప్ప‌టికే శుభాకాంక్షలు తెలిపారు.

గత నెలలోనే హృతిక్ తన లేడీ లవ్ ని ప్ర‌శంసిస్తూ ఒక పోస్ట్ ని షేర్ చేసారు. `సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్`లో సాబా నటనను ప్రశంసించిన‌ హృతిక్ పరిపూర్ణ ప్రియుడిగా క‌నిపించాడు. సాబా ప్రదర్శన టాప్ 10 ప్రదర్శనలలో నిలిచిపోతుందని కీర్తించాడు.

2022లో హృతిక్ -సబా డేటింగ్ ని ప‌బ్లిక్ చేసారు.. హృతిక్ ఫ్యామిలీలో సాబా క‌లిసిపోయింది. కుటుంబ సమావేశాలు, పరిశ్రమ కార్యక్రమాలు, రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో కలిసి కనిపించారు.