Begin typing your search above and press return to search.

ప్రియురాలి నుంచి వ‌సూలు చేస్తున్న స్టార్ హీరో

నిజానికి ఈ ఏరియాలో ఇంటి య‌జ‌మానులు భారీ అద్దెలు వ‌సూలు చేస్తున్నారు. 1000-1300 చ‌.అడుగుల విస్తీర్ణంలోని అపార్ట్ మెంట్ కి ఏకంగా ల‌క్ష పైగా నెల‌వారీ అద్దె వ‌సూలు చేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   27 Aug 2025 1:00 PM IST
ప్రియురాలి నుంచి వ‌సూలు చేస్తున్న స్టార్ హీరో
X

`వార్ 2` డిజాస్ట‌ర్ ఫ‌లితంతో హృతిక్ రోష‌న్ తీవ్రంగా నిరాశ‌ను ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 450కోట్ల బ‌డ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కేవ‌లం 200 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేయ‌డం పెద్ద నిరాశ‌. ఈ చిత్రంతో బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసిన ఎన్టీఆర్ కి కూడా ఇది మింగుడుప‌డ‌ని ఫ‌లితం. మ‌రోవైపు గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ త‌న త‌దుప‌రి ప్రాజెక్టుల‌పై దృష్టి సారించార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ముఖ్యంగా క్రిష్ 4 ని హృతిక్ స్వీయ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

మ‌రోవైపు రోష‌న్ ల రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ గురించి ఇటీవ‌ల‌ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కుముందు హృతిక్ రోష‌న్- రాకేష్ రోష‌న్ జోడీ ముంబై జుహూలోని ఒకే భ‌వంతిలో మూడు అపార్ట్ మెంట్ల (18, 19, 20 అంత‌స్తులు)ను కొనుగోలు చేసారు. దీనికోసం ఏకంగా 97.5 కోట్లు చెల్లించార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇందులో 19-20 అంత‌స్తుల్లో డూప్లెక్స్ ఉండ‌గా, 18వ అంత‌స్తులో అపార్ట్ మెంట్ విడిగా ఉంటుంది. ఇప్పుడు హృతిక్ త‌న ప్రియురాలు సాబా ఆజాద్ కి ఈ ఖాళీ అపార్ట్ మెంట్ ని అద్దెకు ఇచ్చార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. సీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్ ని ఏడాది పాటు లీజ్ ఒప్పందం ప్ర‌కారం.. సాబా నెల‌కు 75000 చొప్పున చెల్లించాల్సి ఉంది.

నిజానికి ఈ ఏరియాలో ఇంటి య‌జ‌మానులు భారీ అద్దెలు వ‌సూలు చేస్తున్నారు. 1000-1300 చ‌.అడుగుల విస్తీర్ణంలోని అపార్ట్ మెంట్ కి ఏకంగా ల‌క్ష పైగా నెల‌వారీ అద్దె వ‌సూలు చేస్తున్నారు. కానీ 12000 చ‌.అడుగుల విస్తీర్ణంలో ఉన్న అపార్ట్ మెంట్ ని ప్రియురాలి కోసం చాలా త‌క్కువ అద్దెకు ఒప్పందం చేసుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 12000 చ‌.అడుగుల విస్తీర్ణం అంటే సుమారు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు అయినా వ‌సూలు చేయాల్సి ఉండ‌గా, హృతిక్ త‌న‌ ప్రియురాలి కోసం త‌క్కువ అద్దెకు అపార్ట్ మెంట్ ని లీజుకు ఇచ్చాడు. ఆగ‌స్టు 4న స‌బా అజాద్ తో ఒప్పందం పూర్త‌యింది. ప్రారంభం ఆమె 1.25 ల‌క్ష‌ల డిపాజిట్ చెల్లించిన‌ట్టు తెలిసింది. అయితే ప్రియురాలి నుంచి అద్దె వ‌సూలు చేయ‌డం అలా ఉంచితే, అంత త‌క్కువ‌కు ఎలా అద్దెకిస్తాడు? అంటూ హృతిక్ పై ఆరాలు మొద‌ల‌య్యాయి.

నిజానికి ఇదే భ‌వంతిలో గుజ‌రాత్ కి చెందిన ఒక బిజినెస్ ఫ‌ర్మ్ 3600 చ‌.అ.ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఫ్లాట్ కోసం నెల‌వారీ 6 ల‌క్ష‌లు చెల్లించేందుకు లీజు ఒప్పందం చేసుకుంది. అయితే చాలా మంది సెల‌బ్రిటీలు ఖాళీగా భ‌వంతుల‌ను వ‌దిలేయ‌డం కంటే త‌క్కువ అద్దెకు అయినా వేరొక‌రికి ఇవ్వ‌డం ద్వారా ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.

రోష‌న్ ఫ్యామిలీ చాలా కాలంగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో త‌ల‌మున‌క‌లుగా ఉంది. ఇంత‌కుముందు ముంబై అంధేరిలోని మూడు ఫ్లాట్‌ల‌ను ఈ కుటుంబం 6.75కోట్ల‌కు అమ్మేసారు. అలాగే గురేగావ్, పూణేలోని అపార్ట్ మెంట్ల కోసం ల‌క్ష‌ల్లో నెల‌వారీ అద్దెలు కూడా చెల్లిస్తున్నారు. గొరేగావ్ లో 2727 చ‌.అ.ల వాణిజ్య ఆస్తిని నెల‌కు 5.62ల‌క్ష‌ల‌కు, పూణేలోని 9000 చ‌.అడుగుల విస్తీర్ణంలోని ఆస్తిని 6.08ల‌క్ష‌ల అద్దెకు తీసుకున్నారు.