ఫోటో స్టోరి: గ్రీకు వీరుడితో చక్కని చుక్క
విడుదలైన ఫోటోలలో హృతిక్- సాబా జంట ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించారు. పెళ్లి కోసం హృతిక్ ముదురు నీలం రంగు షేర్వానీ ధరించాడు.
By: Sivaji Kontham | 27 Dec 2025 4:00 AM ISTఅతడు గ్రీకు వీరుడిగా హృదయాలను ఏల్తున్నాడు. మగువల మనసుల్లో మహారాజుగా కొలువున్నాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్న ఈ హీరో ఎవరో పరిచయం అవసరం లేదు. ది గ్రేట్ హృతిక్ రోషన్... అయితే అతడి హృదయ సామ్రాజ్యాన్ని ఏల్తున్న ఆమె ఎవరో.. పరిచయం అసవరం లేదు. ఇటీవలి కాలంలో హృతిక్ ప్రియురాలిగా సాబా ఆజాద్ ప్రజలకు చాలా సుపరిచితురాలు. సాబా మంచి గాయని, ప్రతిభావని. ఆ ఇద్దరికీ జోడీ చక్కగా కుదిరింది. సుజానే ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత హృతిక్ కి తోడు నీడగా ఉంది సాబా.

సాబా ఆజాద్‌తో ప్రతి పబ్లిక్ ఈవెంట్లోను సందడి చేస్తున్నాడు హృతిక్. ఈ అందమైన జంట ఎక్కడ కనిపించినా కెమెరాలు అటువైపే చూస్తున్నాయి. ఇప్పుడు ఓ బంధువు వివాహంలో హృతిక్ రోషన్ తన స్నేహితురాలు సబా ఆజాద్ తో కలిసి కనిపించారు. ఈ పెళ్లి నుంచి కొన్ని అందమైన ఫోటోలు బయటికి వచ్చాయి.

విడుదలైన ఫోటోలలో హృతిక్- సాబా జంట ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించారు. పెళ్లి కోసం హృతిక్ ముదురు నీలం రంగు షేర్వానీ ధరించాడు. ఎరుపు రంగు బ్లౌజ్- ఐవరీ లెహంగాతో సబా ఎంతో అందంగా కనిపించింది. సాబా ధరించిన సాంప్రదాయ ఆభరణాలు తన అందాన్ని పదింతలు పెంచాయి. తన చిరునవ్వు చాలా ప్రత్యేకంగా హృదయాలను హత్తుకుంది. గ్రీకు వీరుడి మనసు దోచిన చక్కని చుక్క అంటూ నెటిజనులు సాబాను ప్రశంసిస్తున్నారు. ఈ చక్కని చుక్క సాంప్రదాయానికి ప్రజలు మురిసిపోతున్నారు. అందమైన జంట ఫోటోగ్రాఫ్స్ ని ఫ్యాన్స్ జోరుగా వైరల్ చేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, హృతిక్ `వార్ 2` తర్వాత భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాడు. తన తండ్రి నుంచి పగ్గాలు చేపట్టి, ఇప్పుడు దర్శకుడిగా `క్రిష్ 4`తో నిరూపించాలని ప్రయత్నిస్తున్నాడు. నితీష్ తివారీ రామాయణం, రాజమౌళి `వారణాసి` తర్వాత భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాగా దీని గురించి చాలా చర్చ సాగుతోంది.
