తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!
‘కహో నా ప్యార్ హై’ ఎడిటింగ్ సమయంలో తనకు నచ్చిన ఓ షాట్‌ను తండ్రి రాకేష్ రోషన్ తొలగించడంతో హృతిక్ రోషన్ ఆందోళన చెందారట. తండ్రి స్టూడియో నుంచి వెళ్లిపోయాక ఆటోలో ఎడిటింగ్ రూమ్‌కు వెళ్లి ఆ షాట్‌ను మళ్లీ సినిమాలో చేర్చారు. మరుసటి రోజు అది చూసిన రాకేష్ రోషన్ కూడా అంగీకరించారట.
By: Srikanth Kontham | 12 Nov 2026 1:47 PM ISTబాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ తొలి సినిమా `కహో నా ప్యార్ హై` సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం హృతిక్‌ను ఒక్క రాత్రిలో దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్‌గా మార్చేసింది. అయితే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం వెనుక పాటలు, దర్శకత్వ ప్రతిభే కాకుండా ఓ ఆసక్తికరమైన సీక్రెట్ దాగి ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హృతిక్ రోషన్ ఈ సినిమా ఎడిటింగ్ సమయంలో జరిగిన ఓ మలుపును తాజాగా రివీల్ చేసారు.
`కహోనా ప్యార్ హై` నిర్మాణ సమయంలో దర్శకుడు, తండ్రి అయిన రాకేష్ రోషన్ ఎడిటింగ్ రూమ్‌లో ఎంత కఠినంగా ఉంటారో? హృతిక్ వివరించారు. కొడుకు అన్న ప్రేమతో అనవసరమైన షాట్లను పొడిగించడం రాకేష్ రోషన్‌కు అస్సలు ఇష్టం ఉండదని.. సినిమాను నిష్పక్షపాతంగా ఎడిట్ చేసేవారని హృతిక్ తెలిపారు. ఎడిటింగ్ సమయంలో తన మీద ఉన్న మంచి షాట్‌ను కూడా తండ్రి కట్ చేయడం చూసి హృతిక్ లోలోపల ఎంతో కలవరపడ్డారట. తాను ఎంతో కష్టపడి నటించిన ఆ షాట్‌ను సినిమా నుంచి తొలగించడంతో ఏం చేయాలో తెలియక మనసులో ఆందోళనట్లు హృతిక్ గుర్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే హృతిక్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తండ్రి ఎడిటింగ్ రూమ్ నుంచి ఇంటికి వెళ్లిన అనంతరం హృతిక్ సైలెంట్ గా ఆటో ఎక్కి ఎడిటింగ్ స్టూడియోకి వెళ్లారు. తన దగ్గర ఉన్న స్టూడియో తాళాలతో లోపలికి వెళ్లి తండ్రి కట్ చేసిన తన ఫేవరెట్ షాట్‌ను మళ్లీ ఎడిటింగ్ టేబుల్ పైకి తెచ్చి యథావిధిగా కలిపారు. ఆ షాట్ సినిమాకు ప్లస్ అవుతుందా లేదా అని అక్కడ ఉన్న ఎడిటర్‌ను అడిగి నిర్ధారించుకున్న తర్వాతే హృతిక్ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే మరుసటి రోజు ఉదయం రాకేష్ రోషన్ మళ్లీ ఆ సీన్‌ను స్టూడియోలో పరిశీలించారు. తాను కట్ చేసిన షాట్ మళ్లీ సినిమాలో ఉండటం చూసి రాకేష్ రోషన్ మౌనంగా ఆలోచించి `సరే పర్వాలేదు ఇది బాగుంది` అని వదిలేసేరట. ఇది హృతిక్ చేసిన పనే అని తెలిసినా రాకేష్ ఏమీ అనలేదుట. తన ఇష్ట ప్రకారం కానియండని సిబ్బందికి సూచించారుట. ఆ రకంగా కుమారిడిపై ప్రేమను రాకేష్ మరోసారి చాటుకున్నారు.
హృతిక్ బాలీవుడ్ లో అంత పెద్ద స్టార్ అయ్యారంటే? కారణం రాకేష్ రోషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సూచనలు..సలహాలతోనే స్టార్ గా ఎదిగారు. రాకేష్ రాసిన కథలు..తీసిన సినిమాలతోనే ఖాన్ త్రయానికి గట్టి పోటీనిచ్చారు. ప్రస్తుతం హృతిక్ సైతం సొంతంగా కథలు..సినిమాలు డైరెక్ట్ చేసే స్థాయికి చేరుకున్నారు. క్రిష్ -4 చిత్రానికి సంబంధించి క్రియేటివ్ పరంగా ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఎంతో ఉంది.
