Begin typing your search above and press return to search.

స్టార్ హీరోతో నిర్మాత గొడ‌వ‌లోకి లాగినందుకు..!

అయితే ఈ గొడ‌వ‌లోకి హృతిక్ పేరును డ్రాగ్ చేయ‌డంతో ర‌ణ్ వీర్ పై అత‌డు అస‌హ‌నం వ్య‌క్తం చేసాడు.

By:  Sivaji Kontham   |   14 Feb 2026 6:00 AM IST
స్టార్ హీరోతో నిర్మాత గొడ‌వ‌లోకి లాగినందుకు..!
X

ర‌ణ్ వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో `డాన్ 3`ని ప్ర‌క‌టించిన ఫ‌ర్హార్ అక్త‌ర్ ఆ త‌ర్వాత అత‌డిని అవ‌మానిస్తూ, హృతిక్ రోష‌న్‌ తో సంప్ర‌దింపులు సాగిస్తున్నాడ‌ని రణ్ వీర్ ఓ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించాక ఆ ఇద్ద‌రి మ‌ధ్యా విభేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ గొడ‌వ‌లోకి హృతిక్ పేరును డ్రాగ్ చేయ‌డంతో ర‌ణ్ వీర్ పై అత‌డు అస‌హ‌నం వ్య‌క్తం చేసాడు.

తాజాగా హృతిక్ పాపుల‌ర్ హీరో ర‌ణ్ వీర్ ప్ర‌క‌ట‌న‌ను ఖండించాడు. ఫ‌ర్హాన్ త‌న‌ను సంప్ర‌దించ‌లేద‌ని అన్నాడు.

ఇప్పుడు హృతిక్ స్ప‌ష్ఠంగా దానిని ఖండించ‌డంతో అంద‌రికీ ఒక స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది... హృతిక్ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో ఇంకా ఏం చెప్పాడంటే? డాన్ 3 నుంచి షారుఖ్ ఖాన్ తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్‌లోకి హృతిక్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరకు రణవీర్ సింగ్ ఖరారయ్యారు. ఫ‌ర్హాన్ అక్త‌ర్ అత‌డితో ముందుకు వెళ్లాల‌ని ధృఢ‌నిశ్చ‌యంతో క‌నిపించాడు. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ సినిమా ముందుకు సాగ‌లేదు.

ఇంత‌లోనే రణవీర్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో ``హృతిక్ తో ఫ‌ర్హాన్ చర్చిస్తున్నాడు`` అని చెప్పడం హృతిక్‌ను విస్మయానికి గురిచేసింది. దీనిపై స్పందిస్తూ -``ఇతర నటీనటులు నా కెరీర్ నిర్ణయాల గురించి లేదా నా చర్చల గురించి మాట్లాడటం సమంజసం కాదు. నా ప్రాజెక్టుల గురించి నేనే స్వయంగా ప్రకటిస్తాను`` అని హృతిక్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. డాన్ సిరీస్ అంటే తనకు గౌరవం ఉందని, అయితే తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నానని హృతిక్ తెలిపారు.

`వార్ 2` త‌ర్వాత అత‌డు `క్రిష్ 4` కోసం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేస్తున్నాడు. కానీ బ‌డ్జెట్ సంబంధ స‌మ‌స్య‌ల కార‌ణంగా అత‌డు వేరొక ప్రాజెక్టుపై దృష్టి సారించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇంత‌లోనే ఇప్పుడు ర‌ణ్ వీర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై హృతిక్ స్ప‌ష్ఠ‌తనిచ్చాడు. రణవీర్ సింగ్‌తో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్తూనే, వృత్తిప‌ర‌మైన‌ విషయంలో క్లారిటీ ఉండాలని కోరుకున్నాడు.

మొత్తానికి `డాన్ 3` విషయంలో హృతిక్ రోషన్ తన వెర్షన్‌ను స్ప‌ష్ఠంగా చెప్పాడు. ఇకపై రణవీర్ సింగ్ తో ఇది ఉంటుందా? లేక షారూఖ్ ఖాన్ తిరిగి వ‌స్తాడా? అన్న‌దానిపై స‌రైన జ‌వాబు లేదు. అమితాబ్, షారూఖ్ తర్వాత రణవీర్ ఆ రేంజ్ `డాన్` ఇమేజ్‌ను అందుకోగలరా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.