ప్రియాంక చోప్రా, కియారాలను పక్కన బెట్టి రష్మిక?
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కు `వార్ 2` రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో తడబడింది.
By: Srikanth Kontham | 17 Sept 2025 9:00 PM ISTబాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కు `వార్ 2` రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో తడబడింది. ఈ సినిమాతో హృతిక్ టాలీవుడ్ మార్కెట్ బిల్డ్ చేసుకోవాలని చూసాడు. కానీ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించినా కలిసి రాలేదు. అంతకు ముందు రిలీజ్ అయిన `ఫైటర్` కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో హృతిక్ తదుపరి ప్రాజెక్ట్ `క్రిష్ -4`పైనే హృతిక్ ఆశలన్నీ.
అన్నీ తానైన వేళ:
`క్రిష్` ప్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతోన్న ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ ఇది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. క్రిష్ ప్రాంచైజీలోనే భారీ కాన్వాస్ పై ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. నటీనటుల నుంచి బడ్జెట్ వరకూ ఎక్కడా రాజీ పడకుండా రెడీ అవుతున్నారు. ఈ సినిమాపై హృతిక్ ప్రత్యేక ఫోకస్ తో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తానే కెప్టెన్ కుర్చీ కూడా ఎక్కుతున్నాడు. `క్రిష్ 4` తో డైరెక్టర్ గానూ లాంచ్ అవ్వడం విశేషం. నటుడిగా తన అనుభవం....మేకింగ్ పట్ల అవగాహనతో ఎలాంటి సందేహం లేకుండా కెప్టెన్ బాధ్యతలు చేపడుతున్నారు.
పాన్ ఇండియా ఇమేజ్ కోసమా:
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అన్నీ తానై పని చేస్తున్నాడు. ఆ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇందులో హీరోయిన్ ఎవరు? అంటే మళ్లీ ప్రియాంక చోప్రాను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అటుపై కియారా అద్వానీ పేరు కూడా తెరపైకి వచ్చింది. వీళ్లెవ్వరు ఇంకా ఫైనల్ కాలేదు. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తో కూడా హృతిక్ డిస్కస్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. రష్మికు పాన్ ఇండియాలో ఉన్న ఇమేజ్ ను ఎన్ క్యాష్ చేసుకునే దిశగా హృతిక్ ఈ విధంగా లోచన చేస్తున్నాడా? అన్న సందేహం రాకమానదు.
కన్పమ్ అయితే తిరుగుండదు:
ఎన్టీఆర్ తో సాధ్యం కాకపోవడంతో రష్మికను రంగంలోకి దించుతున్నారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. మరి రష్మిక ఎంట్రీ వెనుక వాస్తవం ఎంతో తెలియాలి. `యానిమల్` , `ఛావా` లాంటి విజయాలతో రష్మిక బాలీవుడ్ లో క్వీన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. పెద్ద స్టార్లే ఆమెతో కలిసి నటించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే `సికిందర్` లో సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేసింది. ఆ సినిమా సక్సెస్ అయితే లెవల్ మరోలా ఉండేది. కానీ ఫలితం నిరాశ పరిచింది. అయినా ఆ ప్రభావం ఎక్కడా పడలేదు. తనకు రావాల్సిన అవకాశాలు వస్తూనే ఉన్నాయి. `క్రిష్ 4` కూడా కన్పమ్ అయితే తిరుగుండదు. మరేం జరుగుతుందన్నది చూడాలి.
