అదే నిజమైతే? హృతిక్ నెంబర్ -3!
సౌత్ దర్శకులు సృష్టిస్తున్న సంచలనాలు చూసి బాలీవుడ్ దిగ్గజాలు కూడా వరుసగా వారి వైపే మొగ్గు చూపుతున్నారు.
By: Srikanth Kontham | 19 Oct 2026 2:00 PM ISTసౌత్ దర్శకులు సృష్టిస్తున్న సంచలనాలు చూసి బాలీవుడ్ దిగ్గజాలు కూడా వరుసగా వారి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీతో కలిసి షారూఖ్ ఖాన్ `జవాన్` చిత్రంతో పాన్ ఇండియా రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. అటుపై బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మధ్యలో అమీర్ ఖాన్ కూడా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసినా? వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా హృతిక్ రోషన్ సౌత్ డైరెక్టర్‌తో చేతులు కలుపుతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హృతిక్ రోషన్ తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాస్ ఎలిమెంట్స్, విభిన్నమైన డార్క్ కామెడీని పక్కాగా మిక్స్ చేసి ప్రేక్షకులను మెప్పించడంలో నెల్సన్ దిలీప్‌కుమార్ దిట్ట. రజనీకాంత్‌తో తీసిన `జైలర్` సాధించిన సంచలన విజయం తర్వాత ఆయన పేరు ప్యాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది. అదే క్రమంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌ను దృష్టిలో ఉంచుకుని ఓ ఆసక్తికరమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన `జైలర్ 2` చిత్రంలో హృతిక్ రోషన్ కీలకమైన గెస్ట్ రోల్లో కనిపించి నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. థియేటర్లలో ఆయన పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాతే, ఇద్దరి కాంబినేషన్లో పూర్తిస్థాయి సినిమా వస్తే ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. గెస్ట్ రోల్లోనే అంతటి ఇంపాక్ట్ చూపించిన హృతిక్.. నెల్సన్ మార్క్ మేకింగ్‌తో పూర్తిస్థాయి హీరోగా నటిస్తే ఆ మేజిక్ వేరేలా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ కాంబో ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందనే వార్త బయటకు రావడమే ఆలస్యం నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.
సౌత్ మేకర్ల కథా కథనాలు, కమర్షియల్ హంగులకు ఉత్తరాది ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతుండటంతో బాలీవుడ్ హీరోలు సౌత్ దర్శకుల వైపు మొగ్గు చూపుతున్నారు. షారూఖ్ `జవాన్ ` తో వెయ్యి కోట్ల క్లబ్లో చేరగా, సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా హృతిక్ రోషన్ కూడా ఇదే బాటపట్టి నెల్సన్‌తో ప్రాజెక్ట్ ఓకే చేస్తే సౌత్ దర్శకుడితో హ్యాండ్ షేక్ చేసిన మూడో బాలీవుడ్ టాప్ హీరోగా హృతిక్ రికార్డుల్లోకి ఎక్కుతారు. ఇది కేవలం కాంబినేషన్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండిస్ట్రీలో నార్త్-సౌత్ సరిహద్దులను మరింత చెరిపేసే పరిణామంగా మారుతుంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కథా చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని తెలుస్తోంది. నెల్సన్ మార్క్ స్టైలిష్ యాక్షన్, డార్క్ కామెడీతో కూడిన మాస్ ఎంటర్టైనర్లో హృతిక్ కనుక నటిస్తే ఆయన కెరీర్లోనే ప్రత్యేక చిత్రంగా నిలుస్తుం దనడంలో సందేహం లేదు. హృతిక్ డ్యాన్స్, యాక్షన్ టైమింగ్‌కు నెల్సన్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పొచ్చు.
