Begin typing your search above and press return to search.

క్రిష్ పై ఇంత నమ్మకం ఏంటి సామీ!

అలా భారీ అంచనాలతో వార్-2 మూవీ విడుదలైనప్పటికీ.. ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. చివరికి సినిమా అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది.

By:  Madhu Reddy   |   9 Sept 2025 8:30 AM IST
క్రిష్ పై ఇంత నమ్మకం ఏంటి సామీ!
X

హృతిక్ రోషన్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన వార్ -2 మూవీ ఆగస్టు 14న థియేటర్లోకి వచ్చి మొదటి రెండు రోజులు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత భారీగా కలెక్షన్లు పడిపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది.ఈ సినిమా కారణంగా యష్ రాజ్ ఫిల్మ్స్ భారీగా నష్టాలను ఎదుర్కొంది. అంతేకాదు ఈ సినిమా వల్ల చాలామంది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు కూడా వచ్చాయి. అలా భారీ అంచనాలతో వార్-2 మూవీ విడుదలైనప్పటికీ.. ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. చివరికి సినిమా అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది.

అయితే వార్ -2 ఫ్లాప్ అయినప్పటికీ కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ హృతిక్ రోషన్ పై నమ్మకాన్ని తగ్గించుకోవడం లేదు. ఎందుకంటే వార్-2 ఫ్లాప్ అయినా హృతిక్ రోషన్ నెక్స్ట్ చేసే సినిమాకి యష్ రాజ్ ఫిలిమ్స్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం తెలిసి హృతిక్ రోషన్ పై ఇంత నమ్మకం ఏంటి సామీ అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఇక అసలు విషయం ఏమిటంటే.. హృతిక్ రోషన్ నటించబోయే క్రిష్ ఫ్రాంఛైజీ క్రిష్ 4 గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. అదేంటంటే క్రిష్ -4 కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాకేష్ రోషన్ బిజీ బిజీగా ఉన్నారట. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుండి మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా డైరెక్టర్ రాకేష్ రోషన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే.. రాకేష్ ఫిల్మ్ క్రాఫ్ట్ బ్యానర్లో తెరకెక్కుతున్న క్రిష్ 4 మూవీ కి సహనిర్మాతగా యష్ రాజ్ ఫిలిమ్స్ వ్యవహరిస్తున్నట్టు తెలిపారు.

దీంతో ఈ విషయం బీటౌన్ లో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు హృతిక్ రోషన్ నటించిన వార్-2 మూవీ ఇటీవల విడుదలై ప్లాఫ్ అయినా కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ కి హృతిక్ రోషన్ మీద పూర్తి నమ్మకం ఉంది.అందుకే క్రిష్ 4 మూవీని కూడా నిర్మించడానికి ముందుకు వచ్చారు అంటున్నారు. అయితే మరికొంతమందేమో క్రిష్-4 మూవీతో రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఇక వార్ 2 మూవీ రిజల్ట్ హృతిక్ రోషన్ నటించబోయే అప్ కమింగ్ సినిమాలపై పడుతుందని అందుకే క్రిష్ 4 మూవీ బడ్జెట్ విషయంలో యష్ రాజ్ ఫిలిమ్స్ కాస్త ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టాలని కామెంట్లు పెడుతున్నారు. మూవీ కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టి ఇబ్బందుల్లో పడకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు.

కానీ ఇప్పటివరకు క్రిష్, క్రిష్ 2, క్రిష్ 3 ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో క్రిష్ 4 మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే క్రిష్-4 సినిమాకి భారీ బడ్జెట్ ని పెట్టడానికి యష్ రాజ్ ఫిలిమ్స్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రిష్ 4 మూవీ వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసి 2027లో విడుదల చేయాలని రాకేష్ రోషన్ భావిస్తున్నారు..