'క్రిష్ 4' డైలమా: నక్కను చూసి వాత పెట్టుకోవడం కుదరదు
అనారోగ్యం కారణంగా రాకేష్ రోషన్ ఈ ప్రాజెక్టుకు బాధ్యతలు చేపట్టకపోయినా.. హృతిక్ బాధ్యతలు తీసుకున్నా ప్రయోజనం ఏదీ లేదు.
By: Sivaji Kontham | 3 Aug 2026 10:52 AM ISTహృతిక్ రోషన్ లాంటి ఒక డెబ్యూ డైరెక్టర్ క్రిష్ ఫ్రాంఛైజీలో 4వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారని, స్వయంగా నటిస్తూ, సినిమాకి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారని రాకేష్ రోషన్ బృందం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హృతిక్ బాధ్యతలు చేపట్టినా కానీ, ఈ ప్రాజెక్టులో ఎలాంటి కదలికలు రాలేదు. అనారోగ్యం కారణంగా రాకేష్ రోషన్ ఈ ప్రాజెక్టుకు బాధ్యతలు చేపట్టకపోయినా.. హృతిక్ బాధ్యతలు తీసుకున్నా ప్రయోజనం ఏదీ లేదు.
యష్ రాజ ఫిలింస్ అధినేత బడ్జెట్ విషయంలో రోషన్ డ్యూయోతో విభేధించారని కూడా కథనాలొచ్చాయి. క్రిష్ 4 కోసం వేల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని రాకేష్ రోషన్ తొలి నుంచి చెబుతూనే ఉన్నారు. బడ్జెట్లు సర్ధుబాటు కాకపోవడం వల్లనే తాము ఈ ప్రాజెక్టును డిలే చేస్తున్నామని స్పష్ఠంగా చెప్పారు. ఈరోజుల్లో అవెంజర్స్, అవతార్ లాంటి భారీ చిత్రాలను చూడటానికి అలవాటు పడిన భారతీయుల కళ్లకు సాధాసీదా బడ్జెట్లతో సినిమాలు తీసి చూపిస్తామంటే నచ్చవని చాలా ప్రాక్టికల్ గా ఆలోచించారు రాకేష్ రోషన్.
కారణం ఏదైనా ఇప్పుడు స్పైడర్ మేన్ - బ్రాండ్ న్యూ డే గ్రాండ్ సక్సెస్ - భారీ ఓపెనింగులు చూసాక.. అసలు భారతీయ సూపర్ హీరో క్రిష్ కథతో నాలుగో భాగం ఎప్పుడు తెరకెక్కుతుంది? అంటూ నిలదీసేవాళ్లు పెరిగారు. సోషల్ మీడియాల్లో దీనిపై ఇప్పుడు విస్త్రతంగా చర్చ సాగుతోంది. అయితే ప్రాక్టికాలిటీ అనేది వేరుగా ఉంటుంది. బడ్జెట్లు పెట్టేవాళ్ల చుట్టూనే సినిమా ఇండస్ట్రీ తిరుగుతుందనేది ఒక నిత్య సత్యం. యష్ రాజ్ ఫిలింస్ ఈ సినిమా కోసం ఆశించిన బడ్జెట్ సమకూర్చినప్పుడు ఎందుకు చిత్రీకరణకు వెళ్లరు? అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఇంకా డైలమా కొనసాగడానికి బడ్జెట్ పరమైన సమస్యలే కారణమని ఊహిస్తున్నారు.
మొదటి రోజే 100 కోట్లు కొల్లగొట్టి మొదటి వీకెండ్ లో 300 కోట్లు పైగా వసూలు చేసే రేంజులో క్రిష్ 4 కూడా తెరకెక్కితేనే స్పైడర్ మేన్ - బ్రాండ్ న్యూ డే రేంజు రిజల్ట్ ను అందుకోగలదు. భారీ విజువల్స్- అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ సామర్థ్యం చాలా అవసరం. వీటన్నిటినీ మించి ఎమోషన్ ని రగిలించే కంటెంట్ కోసం స్క్రిప్టును తీర్చిదిద్దే సమర్థత కూడా ఇంకా ముఖ్యమైనది. మొత్తానికి ఏం లోపం ఉందో తెలీదు కానీ క్రిష్ ఫ్రాంఛైజీ నుంచి నాలుగో సినిమా బయటకు రావాలంటే ఇంకా చాలా సమయం పట్టేట్టు కనిపిస్తోంది.
ఈలోగానే రామాయణం, వారణాసి, కల్కి 2898 ఏడి, డ్రాగన్ వంటి చిత్రాలు భారతదేశంలో స్పైడర్ మేన్- బ్రాండ్ న్యూ డే తరహా ఓపెనింగులతో సంచలనాలు సృష్టిస్తాయని అంచనా వేస్తున్నారు. బహుశా ఈ సినిమాలన్నీ `క్రిష్ 4`కి ఒక దారి చూపిస్తాయని కూడా అభిమానులు భావిస్తున్నారు. ఎంసియు, డిసియు రేంజు సినిమాగా క్రిష్ 4 ని మలచాలంటే కచ్ఛితంగా రామాయణం కోసం నమిత్ మల్హోత్రా పెడుతున్నంత పెద్ద బడ్జెట్ ని యష్ రాజ్ ఫిలింస్ ఆదిత్యా చోప్రా సమకూర్చాల్సి ఉంటుంది. కానీ అది జరుగుతుందా? అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారిందని హిందీ మీడియాల్లో కథనాలొస్తున్నాయి. ప్రస్తుతానికి నక్కను చూసి వాత పెట్టుకోవడం కుదరదు!
