ఈ ప్రకటన చూసి తలలు గోక్కుంటున్నారు!
గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్- కత్రిన కైఫ్ జంట పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. జిందగీ నా మిలేగీ దోబారా, బ్యాంగ్ బ్యాంగ్ వంటి చిత్రాలలో ఈ జంట కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది.
By: Sivaji Kontham | 25 Aug 2025 10:27 AM ISTగ్రీక్ గాడ్ హృతిక్ రోషన్- కత్రిన కైఫ్ జంట పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. జిందగీ నా మిలేగీ దోబారా, బ్యాంగ్ బ్యాంగ్ వంటి చిత్రాలలో ఈ జంట కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత హ్యాట్రిక్ మూవీలో నటించడం సాధ్యపడలేదు. కొన్ని ప్రయత్నాలు జరిగినా కుదరలేదు. కానీ ఇప్పుడు ఈ జంట ఒక వాణిజ్య ప్రకటనలో కలిసి కనిపించారు. ఇది ఊహించని విధంగా అందరికీ షాకిచ్చింది. ఈ ప్రకటనలో ఆ ఇద్దరి కెమిస్ట్రీ విషయంలో పలు సందేహాలకు తావిచ్చింది. ఇది ఓ అంతర్జాతీయ వాచ్ బ్రాండ్ కోసం ప్రచారం. హృతిక్ ఒక ఖరీదైన వాచ్ ని కత్రినకు కానుకగా ఇచ్చాడు.
తనకు అందిన బహుమతిని చూసేందుకు బాక్స్ తెరిచి అందులోని వాచ్‌ను చూసి కత్రిన అందంగా నవ్వుతూ చూస్తుంది. హృతిక్ ''ఏదో ప్రత్యేకమైనది.. ఈ సెలబ్రేషన్ కోసం'' అని అంటాడు. కత్రినా ప్రతి స్పందిస్తూ, ''ఇది పరిపూర్ణమైనది!'' అని అనడంతో ప్రకటన ముగుస్తుంది. ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లోకి వచ్చేప్పుడు.. ఈ అనుభూతి అందమైన క్షణం...ఇప్పుడు సమయం వచ్చింది! అని నేపథ్యంలో వినిపిస్తుంది. అయితే ఈ ఫ్రేమ్ లో ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ఏమాత్రం వర్కవుట్ కాలేదు. పైగా ఆ ఇద్దరూ కలిసి నటించారా లేదా? అనే సందేహం కలిగింది. ఆ విజువల్ అంత చెత్తగా ఎందుకు కనిపించిందో తెలియక అభిమానులు తలలు గోక్కుంటున్నారు.
ఇది విడివిడిగా చిత్రీకరించి ఒక చోట ఎడిటింగ్ చేసారు... కానీ అది చెత్త ఎడిటింగ్! అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేసారు. ఆ ఇద్దరూ కలిసి నటించలేదని విడి విడిగా షూట్ చేసారని చాలా మంది గెస్ చేసారు. విడిగా షూట్ చేసారు.. ఎందుకలా చేసారు? చివరి షాట్‌లో అది స్పష్టంగా కనిపిస్తుంది..అంతా చెడగొట్టారు! అని ఒకరు కామెంట్ చేసారు.
హృతిక్ నటించిన వార్ 2 ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది. తదుపరి అతడు క్రిష్ 4లో నటిస్తూ, దర్శకత్వం వహించనున్నారు. ఇంతకుముందే ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024లో మెర్రి క్రిస్మస్ లో నటించిన కత్రిన ఆ తర్వాత టైగర్ 3లో సల్మాన్ సరసన నటించింది. తర్వాత కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు.
