ఒకేసారి స్టార్ హీరో రెండు పనుల్లో!
ఈ నేపథ్యంలో `క్రిష్ 4` దర్శకత్వ బాధ్యతలు కూడా తానే చేపడుతున్నారు. ఆయన స్వీయా దర్శకత్వంలో క్రిష్ -4కి రంగం సిద్దమవుతోంది.
By: Srikanth Kontham | 11 Oct 2025 2:00 PM ISTబాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఇంత వరకూ నటుడిగా మాత్రమే సుపరిచితం. ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అరలించారు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. బాలీవుడ్ ని ఖాన్ లు..కపూర్ లు ఏల్తోన్న సమయంలో తెరంగేట్రం చేసి తానో సూపర్ స్టార్ ఎదిగాడు. సూపర్ హీరో చిత్రాలు చేయాలంటే అది హృతిక్ మాత్రమే చేయగలడని రూపించిన నటుడు. ఇప్పటికే `క్రిష్` ప్రాంచైజీతో సూపర్ హీరో చిత్రాల్లో తానో బ్రాండ్ అని నిరూపించారు.
ఈ నేపథ్యంలో `క్రిష్ 4` దర్శకత్వ బాధ్యతలు కూడా తానే చేపడుతున్నారు. ఆయన స్వీయా దర్శకత్వంలో క్రిష్ -4కి రంగం సిద్దమవుతోంది. స్టార్ హీరోగా కొనసాగుతోన్న సమయంలోనే హృతిక్ ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది ఓ సంచలనమే. మరి ఆ బాధ్యతను ఎంత వరకూ దిగ్విజయంగా నిర్వహిస్తారో చూడాలి? అనే టెన్షన్ అభిమానుల్లో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో నిర్మాతగా కూడా హృతిక్ ప్రయాణం మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తో చేతులు కలిపారు.
`స్టోర్మ్` అనే వెబ్ సిరీస్ ను అమెజాన్ తో కలిసి హృతిక్ నిర్మిస్తున్నారు. డిజిటల్ రంగంలో అడుగు పెట్టడానికి `స్టోర్మ్` ని సరైన వేదికగా భావిస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాతగా తనకు ఇది ఓ గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. అజిత్ పాల్ సృష్టించిన అద్బుతమైన ప్రపంచం తనని ఎంతగానో ఆకట్టుకుందన్నారు. మరుపు రాని పాత్రలు, భిన్నమైన కథతో స్టోర్మ్ ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువవుతుందని ధీమా వ్యక్తం చేసారు. మరి నిర్మాతగా హృతిక్ కొత్త ప్రయాణం ఎలా సాగుతుందోచూడాలి.
ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు నిర్మాతగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వారు హీరోలగా కొనసాగుతూనే సొంత నిర్మాణ సంస్థలు స్థాపించి నిర్మాతగలగానూ సత్తా చాటుతున్నారు. కానీ హృతిక్ కి ఇంత వరకూ ఆ అవకాశం రాలేదు. తన తండ్రే పెద్ద దర్శక, నిర్మాత కావడంతో? హీరోగా ఇంత కాలం స్వేచ్ఛగా పని చేసుకుంటూ వచ్చారు. కానీ డాడ్ ఇప్పుడంత యాక్టివ్ గా పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో మిగతా బాధ్యతలు కూడా హృతిక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
