Begin typing your search above and press return to search.

ఏం క్లారిటీ బాసూ..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు హృతిక్ రోషన్. నిన్న ఆయన పుట్టినరోజు.

By:  Madhu Reddy   |   13 Jan 2026 10:55 AM IST
ఏం క్లారిటీ బాసూ..
X

సాధారణంగా ఒకప్పుడు ఒక జంట విడిపోయింది అంటే.. మళ్లీ ఎప్పుడైనా ఎదురుగా కనిపిస్తే ఒకరికొకరు విమర్శించుకోవడం తప్ప కలసి క్లోజ్ గా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ అని కొంతమంది సెలబ్రిటీలు ఇప్పటికే నిరూపించారు. ప్రత్యేకించి కొన్ని జంటలు విడిపోయిన తర్వాత మరో పార్ట్నర్ ను వెతుక్కొని వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.





అయితే తమ భాగస్వామ్యులతో మాజీ భాగస్వాములను కలవడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాత్రం రెండవ వివాహం చేసుకోకపోయినా తన గర్ల్ ఫ్రెండ్ తో మాజీ భార్యతో కలసి తన బర్తడే వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడ వైరల్ గా మారింది.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు హృతిక్ రోషన్. నిన్న ఆయన పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే నిన్న తన ఫ్యామిలీతో కలిసి తన బర్తడే వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోలు చూసిన అభిమానులు మాత్రం ఏం క్లారిటీ బాసూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తన పుట్టినరోజు వేడుకల నుండి బయటకు వచ్చిన ఒక ఫోటో ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. విషయంలోకి వెళ్తే ..హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుస్సాన్ ఖాన్ తో పాటు అతని ప్రస్తుత ప్రియురాలు సభ ఆజాద్ లతో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు. అంతే కాదు సుస్సాన్ ఖాన్ ప్రస్తుత ప్రియుడు కూడా ఉన్నారు. ముఖ్యంగా తమ పిల్లలు , కొంతమంది సన్నిహితులతో పాటు మొత్తం కుటుంబం ఇక్కడ కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఇతడు చేస్తున్న పనులు.. తన పిల్లల మానసిక ప్రవర్తన పై ప్రభావం చూపుతోందని ఎద్దేవా చేస్తున్నారు.

అయితే హృతిక్ రోషన్ ఫ్యాన్స్ మాత్రం సహ తల్లిదండ్రులు కాబట్టే విడాకులు తీసుకున్నా.. తమ పిల్లల కోసం మంచి సంబంధాన్ని పంచుకుంటున్నారు. ఇందులో తప్పేముంది అని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది ఎవరికి వారు ఒప్పందంతో విడిపోయిన తర్వాత ఇంకొకరు తమ జీవితంలోకి రాకూడదన్న రూల్ ఏమి లేదు కదా.. అటు తల్లిదండ్రులుగా పిల్లలకు అండగా నిలుస్తూనే.. ఇటు తమ వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషాన్ని పొందుతున్నారు అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఒక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

పైగా అమీర్ ఖాన్ విషయాలను కూడా ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. అమీర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యతో మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నారు కదా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.