అదీ సంగతి: ఆమెతో హార్థిక్.. ఆయనతో నటాషా
ఇంతకుముందు హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయి, తన గాళ్ ఫ్రెండ్ సాబా ఆజాద్‌తో రిలేషన్ షిప్ ప్రారంభించినప్పుడు ఆ ఇద్దరూ జంటగా ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి
By: Sivaji Kontham | 20 Nov 2025 9:32 AM ISTసెలబ్రిటీ ప్రపంచంలో బ్రేకప్ తర్వాత రిలేషన్ షిప్స్ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఇంతకుముందు హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయి, తన గాళ్ ఫ్రెండ్ సాబా ఆజాద్‌తో రిలేషన్ షిప్ ప్రారంభించినప్పుడు ఆ ఇద్దరూ జంటగా ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో బిజినెస్‌మేన్ అర్షద్ గోనీతో సుజానే ఖాన్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా వెబ్‌లోకి వచ్చాయి.
విడిపోయిన రెండు జంటలు వేర్వేరు వ్యక్తులతో సంబంధంలోకి వెళ్లినప్పుడు జనం కామెంట్లు ఎలా ఉంటాయో తెలిసినదే. ఇప్పుడు అలాంటి కామెంట్లు హార్థిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ విషయంలోను వినిపిస్తున్నాయి. ఇటీవల హార్థిక్ పాండ్యా తన భార్య నటాషా నుంచి విడిపోయాక విదేశీ మోడల్ తో డేటింగ్ లో ఉన్నాడని ప్రచారమైంది. ఆ తర్వాత మోడల్ కం నటి మిహీక శర్మతో బాగా సన్నిహితుడు అయిపోయిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా మిహీకతో కలిసి జిమ్ చేసిన హార్థిక్, తనను ఎత్తుకుని క్లోజ్ గా హగ్ చేసుకుని కనిపించాడు. దీంతో ఈ జంట మధ్య ఏం జరుగుతోంది? అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలలో హార్థిక్ - మిహీకలతో పాటు హార్థిక్ పాండ్య - నటాషా స్టాంకోవిక్ ల కుమారుడు అగస్త్య పాండ్య కూడా ఉన్నాడు.
హార్థిక్ వ్యవహారం ఇలా ఉంటే, అతడి నుంచి విడిపోయిన నటాషా మాత్రం అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ అనే ఫిట్నెస్ కోచ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అలెక్స్ తో కలిసి నటాషా జిమ్ చేస్తున్న కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లోకి వచ్చాయి. ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. అలెక్స్ ఇలిక్ ఇంతకుముందు టైగర్ ష్రాఫ్ నుంచి విడిపోయిన దిశా పటానీతో డేటింగ్ చేసాడని పుకార్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు నటాషాతో అతడు సన్నిహితంగా కనిపిస్తున్నాడు. అయితే ప్రస్తుతానికి ఈ జంటల డేటింగులు ఏవీ అధికారికంగా కన్ఫామ్ కాలేదు.
ఓవైపు హార్థిక్- నటాషా జంట కుమారుడు అగస్త్య పాండ్యా వేగంగా ఎదిగేస్తున్నాడు. ఈ చిన్నారి ఇంకా లోకం ఎరుగక ముందే తల్లిదండ్రుల బ్రేకప్ నిజంగా విషాదకరమైనదని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. కానీ హార్థిక్, నటాషా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉండటం నెటిజనుల్లో చర్చకు వచ్చింది. అగస్త్య పాండ్యా ఆలనాపాలన విషయంలో ఎలాంటి డోఖా లేకపోయినా, ఇప్పుడు భాగస్వాములు మారుతుండటంతో అది ఈ చిన్నారి లైఫ్ లో కన్ఫ్యూజన్ కి దారి తీస్తుందని కొందరు నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.
