SVSC: రేలంగి మావయ్యగా గ్రీన్ సిగ్నల్.. రజినీకాంత్ అందుకే చేయలేదా
ముందుగా ఈ కథను అక్కినేని నాగార్జున కూడా చేయాల్సి ఉంది. ఆ పాత్ర కూడా నాగార్జునకు బాగా నచ్చింది కానీ కొన్ని కారణాల వలన నాగార్జున చేయలేదు
By: Madhu Reddy | 12 Nov 2025 12:00 AM ISTతెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటికీ కూడా కొన్ని సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మల్టీస్టారర్ సినిమాలు రావడం లేదు అని అనుకున్న తరుణంలో శ్రీకాంత్ అడ్డాల.. వెంకటేష్ మరియు మహేష్ బాబుతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాను ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా కథను మొదట దిల్ రాజుకి చెప్పినప్పుడే దీనికి ఇద్దరు హీరోలైతే బాగుంటుంది అని పదే పదే చెప్పేవాడు. అయితే అప్పట్లో దిల్ రాజు కూడా అదే ప్రయత్నాన్ని చేశారు.
ముందుగా ఈ కథను అక్కినేని నాగార్జున కూడా చేయాల్సి ఉంది. ఆ పాత్ర కూడా నాగార్జునకు బాగా నచ్చింది కానీ కొన్ని కారణాల వలన నాగార్జున చేయలేదు. మొత్తానికి నాగర్జున చేయవలసిన పాత్రను వెంకటేష్ చేశారు. మహేష్ బాబు పాత్రను తన కోసమే అనుకున్నారు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ సక్సెస్ గా నిలిచింది. ఈ సినిమా చూస్తున్న ప్రతిసారి ఒక సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఇప్పటికీ ఈ సినిమా చూసినా కూడా ఒక కుటుంబంలో పెరిగిన ఫీలింగ్ కలుగుతుంది. దీనిలో పాత్రలు కూడా అలానే గుర్తుండిపోతాయి.
రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్
ఈ సినిమాలో రేలంగి మామయ్య పాత్ర గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాత్ర మంచితనానికి కేరాఫ్ అడ్రస్. చాలామంది నిజ జీవితంలో కూడా ఎవరైనా మంచివాళ్ళు కనిపిస్తే మరీ రేలంగి మావయ్యలా ఉన్నావే అంటూ మాట్లాడుతారు. అంటే ఆ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉంది అని అర్థం చేసుకోవాల్సిందే.
ప్రకాష్ రాజ్ పాత్రలో నటించిన తీరు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ పాత్ర కోసం మొదట రజనీకాంత్ ను సంప్రదించాడు శ్రీకాంత్ అడ్డాల. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ్ మండపంలో అపాయింట్మెంట్ కూడా రజనీకాంత్ ఇచ్చారు. అక్కడ కథను విన్న రజినీకాంత్ కి విపరీతంగా నచ్చింది. ఆయన కూడా చేయడానికి రెడీ అయ్యాడు.
అందుకే చేయలేదు..
అయితే రజినీకాంత్ కి అప్పుడు ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ సినిమాను చేయలేదు. లేకపోతే నాకు తెలుగు సినిమా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని కూడా శ్రీకాంత్ తో రజినీకాంత్ చెప్పారు. ఇదివరకే మోహన్ బాబుతో కలిసి పెదరాయుడు సినిమాలో కూడా ఒక కీలకపాత్రలో కనిపించారు రజినీకాంత్.
అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలకు తండ్రిగా నటించడం అనేది కూడా పెద్ద విషయం ఏమి కాదు. ఒకవేళ రజినీకాంత్ చేసున్న కూడా ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ప్రకాష్ రాజ్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఒక మాములు సన్నివేశాన్ని కూడా తన నటనతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళగలిగిన ప్రతిభ ప్రకాష్ రాజ్ లో ఉంది.
మొత్తానికి రజనీకాంత్ తో అప్పుడు తన కోరికను నెరవేర్చుకోలేకపోయాడు శ్రీకాంత్ అడ్డాల, ఇక భవిష్యత్తులో అయినా ఒక గొప్ప కథను రెడీ చేసి మళ్లీ రజనీకాంత్ తో కలిసి పని చేస్తాడేమో వేచి చూడాలి. ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియో పాతదే అయినా.. మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం
