ఒక్క స్టెప్ సీన్ మొత్తం మారిపోయింది!
ప్రమోషన్స్ ప్రారంభించిన దగ్గరి నుంచి మళ్లీ 'సంక్రాంతికి వస్తున్నాం' ఫార్మాట్ స్టోరీనే ఎంచుకున్నాడనే కామెంట్‌లు వినిపించాయి.
By: Tupaki Entertainment Desk | 8 Jan 2026 12:00 PM ISTఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే దానికి ఆడియో ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. ఈ విషయాన్ని చాలా సినిమాలు నిరూపించాయి. రీసెంట్‌గా `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ నుంచి రీసెంట్ సెన్సేషన్ `ధురంధర్` ఒక్క పాట సినిమాని ఎలాంటి టర్స్ తిప్పిందో.. నెట్టింట సింపుల్ మౌత్ టాక్‌తో ఎలా ట్రెండ్ అయ్యేలా చేసిందో చూశాం. వెంకీ మామ నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీకి భారీ బజ్‌ని క్రియేట్ చేసింది ఒక్క పాటే. గోదారి గట్టు మీద రామ సిలకవే`.. ఈ పాట ఈ మూవీని మరింత వైరల్ అయ్యేలా చేసి ప్రేక్షకుల అటెన్షన్‌ని గ్రాప్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది.
ఆ తరువాత సినిమా కంటెంట్, వెంకీ మార్కు నటన, అనిల్ రావిపూడి మ్యాజిక్, భీమ్స్ మ్యూజిక్..బుడ్డోడి క్యారెక్టర్.. ఇలా ప్రతీదీ సినిమాకు ప్లస్ అయి గత ఏడాది సంక్రాంతి బరిలో ఈ మూవీని విజేతగా నిలబెట్టాయి. `గేమ్ ఛేంజర్` కారణంగా పీకల్లోతు కష్టాల్లో మునిగిన దిల్ రాజు అండ్ కోని సేఫ్‌గా ఒడ్డున పడేసింది. ఇక `ధురంధర్` మూవీ కూడా ఒకే ఒక్క ప్రైవేట్ సాంగ్‌తో వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ కావడం, ఆ తరువాత సినిమా కంటెంట్, అక్షయ్ నటన, ఆదిత్యధర్ టేకింగ్ సినిమాని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ని చేశాయి.
ఇప్పుడు ఇదే మ్యాజిక్ మెగాస్టార్ చిరంజీవి నటించిన `మన శంకరవరప్రసాద్`కు రిపీట్‌కాబోతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ `మన శంకరవరప్రసాద్ గారు` పేరుతో ఫ్యామిలీ యాక్షన్ డ్రామాని చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 12న భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌ని హోరెత్తిస్తున్న అనిల్ రీవిపూడి ఈ మూవీని కూడా తనదైన మార్కు ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కరించాడు. ప్రమోషన్స్ ప్రారంభించిన దగ్గరి నుంచి మళ్లీ `సంక్రాంతికి వస్తున్నాం` ఫార్మాట్ స్టోరీనే ఎంచుకున్నాడనే కామెంట్‌లు వినిపించాయి.
ప్రమోషన్స్ ప్రారంభమైనా కానీ చిరు సినిమాకు రావాల్సినంత బజ్ క్రియేట్ కాలేదు. లిరికల్ వీడియోలు.. శశిరేఖ.. ఫరవాలేదనిపించింది. వెంకీ, చిరు కలిసి చేసిన మాస్ సాంగ్‌ని రిలీజ్ చేసినా అది కూడా కొంత బజ్ క్రియేట్ చేసిందే కానీ ఆశించిన స్థాయిలో మాత్రం రచ్చ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలోనే `హుక్ స్టెప్` సాంగ్ ని విడుదల చేశారు. ఇది ఇప్పుడు సోసల్ మీడియాని షేక్ చేస్తూ దుమ్ముదులిపేస్తోంది. చిరు అంటే హుక్ స్టెప్స్..డ్యాన్సింగ్ సెన్సేషన్.. ఈ విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తూ వింటేజ్ చిరుని, ఆ జోష్‌ని ఈ పాటలో చూపించడంతో సినిమాపై క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఈ పాటలో చిరు వేసిన ఒక్క హుక్ స్టెప్ తో సీన్ మొత్తం మారిపోయింది. రేపు ఈ పాటతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ పాట ప్లే అవుతుండగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్.. సీట్లలోంచి లేచి అభిమానులతో కలిసి వారి కేరింతల మధ్య స్టెప్స్ వేశారంటే ఈ పాట తెచ్చి బజ్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ `ఇంటర్నేట్‌లో క్యూట్ వీడియో ఇదే` అని కామెంట్ చేస్తూ ఈ వీడియో క్లిప్‌ని షేర్ చేయడంతో ఇది నెట్టింట ట్రెండ్ అవుతోంది. అంతా ఈ హుక్ స్టెప్ సాంగ్ `మన శంకరవరప్రసాద్ గారు`పై బజ్‌ని ఏరేంజ్‌లో క్రియేట్ చేయడం విశేషం.
