హనీ రోజ్ 'రాహేలు' ట్రైలర్.. చీకట్లో ఎరుపెక్కిన కళ్ళు వెతకాలి..!
మళయాళంలో తన మార్క్ సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న హీరోయిన్ హనీ రోజ్.
By: Ramesh Boddu | 17 Nov 2025 4:59 PM ISTమళయాళంలో తన మార్క్ సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న హీరోయిన్ హనీ రోజ్. ఐతే అంతకుముందు రెండు దశాబ్దాల క్రితమే తెలుగులో శివజీ సినిమాలో ఆమె నటించినా ఆ తర్వాత ఎందుకో ఇక్కడ చేయలేదు. ఐతే ఆఫ్టర్ లాంగ్ టైం బాలయ్య గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన వీర సిం హా రెడ్డి సినిమాలో హనీ రోజ్ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమెని చూసి తెలుగు ఆడియన్స్ ఫాలో చేయడం మొదలు పెట్టారు. ఐతే తర్వాత తను ఆశించిన రేంజ్ లో పాత్రలు రాకపోవడంతో మళ్లీ సైలెంట్ అయిపోయింది అమ్మడు. ఐతే మలయాళంలో మాత్రం ఆమె వరుస సినిమాలు చేస్తుంది.
హనీ రోజ్ లేటెస్ట్ సినిమా రాహేలు..
ఈ క్రమంలో హనీ రోజ్ లేటెస్ట్ గా చేస్తున్న సినిమా రాహేలు. ఏడాది క్రితమే టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ మళ్లీ సినిమా ట్రైలర్ తో సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. రాహేలు ట్రైలర్ విజువల్ గా ఇంపాక్ట్ కలిగించేలా ఉన్నాయి. విలేజ్ లో జరిగే కథగా ఉన్నా తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన సంఘటనని ఎదుర్కుని కథానాయిక ఏం చేసింది అన్నది రాహేలు కథ. సినిమాలో డైలాగ్స్ ఇంప్రెసివ్ గా అనిపిస్తున్నాయి.
ముఖ్యంగా చీకట్లో ఎతుపెక్కిన కళ్లు.. వాటిని వెతకాలి అంటూ హీరోయిన్ చెబుతుంటే ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. హనీ రోజ్ లీడ్ రోల్ లో ఆమె విశ్వరూపం చూపించేలా రాహేలు సినిమా వస్తుంది. ఈ సినిమాను ఆనందిని బాల డైరెక్ట్ చేస్తున్నారు. హనీ రోజ్ తో పాటు బాబురాజ్, వినీత్ తట్టిల్ డేవిడ్, జాఫర్ ఇడుక్కి నటిస్తున్నారు. సినిమాను మంజు బాదుషా, షాహుల్ హమీద్, రజన్ చిరాయిల్ నిర్మిస్తున్నారు.
ఫిమేల్ సెంట్రిక్ ఇంటెన్స్ మూవీగా..
ట్రైలర్ చూస్తే ఇదొక ఫిమేల్ సెంట్రిక్ ఇంటెన్స్ మూవీగా అనిపిస్తుంది. ఏడాది క్రితం తెలుగులో కూడా టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ సినిమా ట్రైలర్ లో పాన్ ఇండియా రిలీజ్ విత్ తెలుగు వెర్షన్ టైటిల్ కూడా వేశారు. సినిమాతో హనీ రోజ్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. ట్రైలర్ చూసిన ఆడియన్స్ సూపర్ అనేస్తున్నారు. ముఖ్యంగా హనీ రోజ్ కి సంబందించిన ట్రైలర్ లోని క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రాహేలు సినిమా ట్రైలర్ లో ఉన్న స్టఫ్ కి తగినట్టుగా సినిమా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.
