అక్కడ అత్యధిక పారితోషికం ఆవిడకేనా?
హనీ రోజు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇన్ స్టా వంటి మాధ్యమాల ద్వారా భారీగా ఫాలోవర్లను సంపాదించుకుంది.
By: Srikanth Kontham | 17 Nov 2025 9:00 PM ISTమాలీవుడ్ హాట్ సెరైన హానీరోజ్ గురించి పరిచయం అవసరం లేదు. 15 ఏళ్ల క్రితమే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా అప్పుడెవరు గుర్తించలేదు. అమ్మడి కెరీర్ తమిళ, తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది. కానీ రెండు భాషల్లోనూ అప్పట్లో బిజీ కాలేదు. దీంతో కన్నడ, మలయాళ చిత్రాలకే పరిమితమైంది. మళ్లీ తెలుగులో `వీరసింహారెడ్డి` సినిమాతో టాలీవుడ్ లో కంబ్యాక్ అయింది. ఈసారి మాత్రం అమ్మడి అప్పిరియన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. మీనాక్షి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించింది. దీంతో అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే స్టార్ హీరోయిన్ మాత్రం అవ్వలేదు.
అలాంటి నటి పారితోషికం ఎంత అందుకుంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. లక్షల్లోనే సంపాదన ఉంటుంది. యాడ్స్ వంటి వాటి ద్వారా కూడా పెద్దగా ఆదాయం సమకూరదు. కానీ అసలు సంగతేంటి? అంటే హనీరోజ్ మలయాళం హీరోయిన్లు అందరికంటే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా తెరపైకి వచ్చింది. నటిగా ఓ సినిమాకు తీసుకునే పారితోషికం కంటే? యాడ్స్ ద్వారానే భారీ గా ఆర్జిస్తుందని దర్శకుడు వినాయన్ తెలిపాడు. ఈవెంట్లు..యాడ్స్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తుందన్నాడు. కానీ తనకు డబ్బు కంటే సినిమా అంటేనే ఎక్కువ ఇష్టమన్నాడు.
హనీ రోజు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇన్ స్టా వంటి మాధ్యమాల ద్వారా భారీగా ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫోటోలు..వీడియోలు నెట్టింట ట్రెండింగ్ లో నిలుస్తుంటాయి. ఇన్ స్టా ద్వారా కూడా భారీగానే సంపాదిస్తోంది. ఉత్పత్తులను ప్రమోట్ చేయడంతో అదనపు ఆదాయం సమకూరుతుంది. అలాగే హనీ రోజ్ చిత్ర పరిశ్రమకొచ్చి రెండు దశాబ్దాలు పూర్తయింది. 2005లో `బోయ్ ప్రెండ్` అనే తమిళ సినిమాతో అమ్మడి కెరీర్ ప్రారంభమైంది. అటుపై 2008లో `ఆలయం` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
అలా మొదలైన హానీరోజ్ ప్రస్తానం నేటికి దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎంతో మంది నటీమణులు అమ్మడితో పోటీ పడ్డారు. కానీ ఎవరూ నిలబడలేదు. హీరోయిన్ గా మాత్రం హనీరోజ్ ఎస్టాబ్లిష్ కాలేక పోయింది. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడంతో ఇలాంటి ప్రతిభావంతులు వెలుగులోకి రాలేకపోయారు. రెండేళ్లగా హనీరోజ్ ఎలాంటి సినిమాలు చేయలేదు. ప్రస్తుతం `రాహేల్` అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
