Begin typing your search above and press return to search.

హోమ్ బౌండ్ ఎలా ఉంది..?

ఇషాన్ ఖట్టర్, విశాల్ జైత్వా, జాన్వి కపూర్ నటించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు.

By:  Ramesh Boddu   |   23 Nov 2025 3:15 PM IST
హోమ్ బౌండ్ ఎలా ఉంది..?
X

రియల్ లైఫ్ ఇష్యూస్ ని.. కుల, మత వివక్ష నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి.. ఫ్యూచర్ లో వస్తాయి. టెక్నాలజీ పరంగా మనం ఎంత అప్ గ్రేడ్ అవుతున్నా ఇంకా కులం, మతం అంటూ కొన్నిచోట్ల జరిగే పరిణామాలు తెలిసిందే. ఐతే వాటి స్పూర్తితో కొంత వాస్తవికత.. కొంత కల్పితం జత చేసి సినిమాలు చేస్తుంటారు. అలా రీసెంట్ గా వచ్చిన సినిమా హోమ్ బౌండ్ కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ తోనే తెరకెక్కింది.

ఇషాన్ ఖట్టర్, విశాల్ జైత్వా, జాన్వి కపూర్..

ఇషాన్ ఖట్టర్, విశాల్ జైత్వా, జాన్వి కపూర్ నటించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఐతే ఈ సినిమా 98వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో నామినేషన్ లిస్ట్ లో ఉంది. ఈ సినిమా అలా ఆస్కార్ కి నామినేట్ అయ్యిందో లేదో నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది. ఇక ఇప్పుడు ఈ సినిమా మీద ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఆస్కార్ కి నామినేట్ అయ్యింది అంటే సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందని నెట్ ఫ్లిక్స్ లో సినిమా చూసేందుకు ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. హోమ్ బౌండ్ సినిమా కథ విషయానికి వస్తే షోయబ్, చందన్ మంచి స్నేహితులు. వాళ్లకు పోలీస్ అవ్వాలన్న కోరిక ఉంటుంది. దాని కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ వారి చుట్టుపక్కన వాళ్లు వీరిద్దరినీ చాలా తక్కువ చేసి చూస్తుంటారు. వాళ్లకు సమాధానం చెప్పడానికైనా జాబ్ కొట్టాలని అనుకుంటారు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోతారు. ఐతే చందన్ తాను ఇష్టపడిన సుధా భారతి కోసం డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. షోయబ్ ఒక ఆఫీస్ లో జాబ్ జాయిన్ అవుతాడు. ఐతే కొన్ని పరిస్థితుల వల్ల షోయబ్, చందన్ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. ఈ ఇబ్బందుల నుంచి వారు ఎలా బయట పడ్డారు అన్నది హోమ్ బౌండ్ కథ.

చుట్టుపక్కన జరిగినట్టే అనిపించే సన్నివేశాలు..

ఇది ఒక సినిమా అని చెప్పడం కన్నా మన లైఫ్ లో జరిగే సన్నివేశాల సమాహారంగా ఇది వచ్చింది. లైఫ్ లో ఏదో సాధిస్తేనే కానీ విలువ ఇవ్వని మనుషులు, కుల, మత వివక్ష ఇవన్నీ బాగా చూపించారు. ఇషాన్ ఖట్టర్, విశాల్ జైత్వా ఇంప్రెస్ చేశారు. జాన్వి ఉన్నంతలో అదరగొట్టేసింది. కొవిడ్ టైం లో సీన్స్ తో పాటు కొన్ని రియలిస్టిక్ గా అంటే మన చుట్టుపక్కన జరిగినట్టే అనిపించే సీన్స్ ఇంప్రెస్ చేస్తాయి.

ఐతే ఎమోషన్ల్ గా అవుట్ పుట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ హంగులు లేకపోవడం కథకు అడ్డు అనుకున్నారు. ఐతే సినిమా కథ, కథనం ఏది కూడా కొత్తగా ఉండదు. కానీ ఎగ్జిక్యూషన్ బాగుండటం వల్ల సినిమా చూసిన ఆడియన్స్ కు నచ్చేస్తుంది. ఐతే డిఫరెంట్ సినిమాలు ఆశించే వారికి రుచించదు. నీరజ్ ఘేవన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటం వల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మూవీ ట్రెండ్ అవుతుంది.