Begin typing your search above and press return to search.

హోంబలేకి ధీటుగా మైత్రి..?

సౌత్ నిర్మాణ సంస్థలు హోంబలే, మైత్రి రెండు పోటా పోటీగా సినిమాలు చేస్తున్నాయి.

By:  Ramesh Boddu   |   16 Oct 2025 10:50 AM IST
హోంబలేకి ధీటుగా మైత్రి..?
X

సౌత్ నిర్మాణ సంస్థలు హోంబలే, మైత్రి రెండు పోటా పోటీగా సినిమాలు చేస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు ఓ పక్క ప్రాంతీయ సినిమాలు మరో పక్క అన్నట్టుగా ఈ రెండు ప్రొడక్షన్ హౌస్ ల ప్లానింగ్ అదిరిపోతుంది. కన్నడ ప్రొడక్షన్ కంపెనీ హోంబలే ప్రొడక్షన్స్ వాళ్లు కె.జి.ఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ సినిమా తర్వాత నుంచి క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తూ సత్తా చాటుతున్నారు. ఈమధ్యనే యానిమెషన్ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. హోంబలే ప్రొడక్షన్స్ కన్నడలోనే కాదు తెలుగు, తమిళ భాషల్లో కూడా క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.

మైత్రి మూవీ మేకర్స్ తమిళ్, హిందీలో కూడా..

తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా అదే రేంజ్ ప్లానింగ్ తో వస్తుంది. ఆల్రెడీ తెలుగులో పాన్ ఇండియా సినిమాలు ఒక దానికి మించి మరొకటి అనే రేంజ్ లో ఉండగా అది చాలదు అన్నట్టుగా తమిళ్, హిందీలో కూడా సినిమాలు చేస్తున్నారు. తమిళ్ లో తల అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చేసి సక్సెస్ అందుకున్నారు మైత్రి నిర్మాతలు. ఆధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా అజిత్ ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అందించింది.

ఇక హిందీలో సన్నీ డియోల్ తో 'చేసిన జాత్ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. తెలుగు నిర్మాణ సంస్థ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో జాత్ సినిమాను తీసి హిందీలో కూడా సక్సెస్ అందుకున్నారు. సన్నీ మార్కెట్ ని మైత్రి మేకర్స్ వేసిన అంచనాకి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు కూడా షాక్ అయ్యేలా చేసింది. మైత్రి మేకర్స్ ఇలానే పాన్ ఇండియా సినిమాలతో పాటు సెపరేట్ గా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

హోంబలే ప్రొడక్షన్ నెక్స్ట్ తెలుగు హీరో టార్గెట్..

హోంబలే ప్రొడక్షన్ నెక్స్ట్ తెలుగు హీరోల టార్గెట్ తో సినిమాలు ఫిక్స్ చేస్తుంది. ఆల్రెడీ ప్రభాస్ తో వాళ్ల 3 సినిమాల డీల్ కుదిరింది. నెక్స్ట్ టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ తో ప్లానింగ్ ఉందట. సో తెలుగులోనే కాదు అటు పాన్ ఇండియా లెవెల్ లో కూడా హోంబలే ప్రొడక్షన్ కి మైత్రి మూవీ మేకర్స్ గట్టి ఫైట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఐతే ఎవరి ప్లానింగ్ వారిది.. ఎవరి సినిమాలు వారివి కాబట్టి ప్రతి సినిమా ఒక రేంజ్ లో ఇంపాక్ట్ చూపించబోతున్నాయని చెప్పొచ్చు.