Begin typing your search above and press return to search.

హోంబలే ఫిల్మ్స్ నిర్మాణం.. రిషబ్ దర్శకత్వం.. హీరో ఎవరంటే?

కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.. ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే.

By:  M Prashanth   |   3 Aug 2025 11:14 PM IST
హోంబలే ఫిల్మ్స్ నిర్మాణం.. రిషబ్ దర్శకత్వం.. హీరో ఎవరంటే?
X

కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.. ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. విభిన్నమైన కథలతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించాలనే లక్ష్యంతో నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ హోంబలే ఫిల్మ్స్‌ ను 2012లో స్థాపించారు. ముందుక కన్నడ చిత్రాలపై ఫోకస్ పెట్టిన ఆయన.. ఆ తర్వాత బహుళ భాషల్లో మూవీస్ తీస్తున్నారు.

పునీత్‌ రాజ్‌ కుమార్‌ హీరోగా నటించిన నిన్నిందలే మూవీతో నిర్మాణ రంగంలో హోంబలే సంస్థ జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2018లో విడుదలైన కేజీయఫ్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కాంతార, సలార్‌ సీజ్‌ ఫైర్‌, కేజీఎఫ్ సీక్వెల్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరిన్ని సినిమాలు తీస్తోంది.

రీసెంట్ గా యానిమేషన్ మూవీ మహవతార్ నరసింహతో హోంబలే ఫిల్మ్స్ వేరే లెవెల్ హిట్ దక్కించుకుంది. చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ ను నిర్మిస్తోంది. కాంతార పార్ట్-1 షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ 2న ఆ మూవీ విడుదల కానుంది.

అదే సమయంలో ఇప్పుడు మరిన్ని సినిమాలు రూపొందించేందుకు సిద్ధమవుతోంది. అందులో రక్షిత్ శెట్టితో రిచర్డ్ ఆంటోనీ మూవీ ఉంది. దాంతోపాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సీక్వెల్ కూడా ఉంది. ఆ రెండు చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

హోంబలే ఫిల్మ్స్ భవిష్యత్తులో నిర్మించనున్న ఓ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. నెట్టింట ఆ విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ మూవీలో హీరోగా ప్రభాస్ లేదా స్టార్ హీరో యష్ లేదా బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ చర్చలు జరుపుతున్నారని సమాచారం. వారి ముగ్గురిలో హీరోగా ఒకరిని ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ ముగ్గురిలో ఒకరైన ప్రభాస్ తో హోంబలే ఫిల్మ్స్.. మూడు సినిమాలను తీయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసింది. అందులో ఒకటి సలార్-2. మిగతా రెండు ఏంటనేవి క్లారిటీ లేదు. మరి ఇప్పుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఎవరు హీరోగా నటిస్తారో వేచి చూడాలి.