హోంబలే.. సక్సెస్ సీక్రెట్ అదేనా?
అంతేకాదు, ఈ ఐదు సినిమాలకూ కన్నడ దర్శకులే వర్క్ చేయడం కూడా మరో అరుదైన విషయం. కెజిఎఫ్ నుంచి మహావతార్ వరకు, ఐదు సినిమాలూ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ కు మంచి లాభాలను అందించాయి.
By: Sravani Lakshmi Srungarapu | 31 Aug 2025 10:07 AM ISTకర్ణాటక చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ఓ రేర్ ఫీట్ ను సాధించింది. కెజిఎఫ్ చాప్టర్1 సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన హోంబలే ఫిల్మ్స్ తర్వాత సౌత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి కెజిఎఫ్ చాప్టర్2, కాంతార, సలార్ లాంటి పాన్ ఇండియా హిట్లతో విజయ పరంపరను కొనసాగిస్తూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా దూసుకెళ్తుంది.
ఏడేళ్లలో 5 భారీ హిట్లు
రీసెంట్ గా మహావతార్: నరసింహ సినిమాతో అద్భుతమైన విజయం అందుకోవడమే కాకుండా ఆ సినిమాతో రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి ప్రస్తుత కాలంలో మోస్ట్ డామినేటింగ్ ప్రొడక్షన్ హౌస్ గా నిలిచింది. గత ఏడేళ్లలో 5 భారీ బాక్సాఫీస్ హిట్లను వరుసగా అందించి ఏ నిర్మాణ సంస్థ సాధించని అరుదైన ఘనతను సాధించింది హోంబలే ఫిల్మ్స్.
కన్నడ దర్శకులతో హోంబలే రేర్ ఫీట్
అంతేకాదు, ఈ ఐదు సినిమాలకూ కన్నడ దర్శకులే వర్క్ చేయడం కూడా మరో అరుదైన విషయం. కెజిఎఫ్ నుంచి మహావతార్ వరకు, ఐదు సినిమాలూ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ కు మంచి లాభాలను అందించాయి. ఈ ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు రూ.300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మరే ఇతర నిర్మాణ సంస్థ సాధించలేని ఘనతను సాధించింది.
లైనప్ లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు
సినిమాల సక్సెస్ రేటు తగ్గిపోతున్న తరుణంలో హోంబలే ఫిల్మ్స్ ఆడియన్స్ మెప్పించే సినిమాలను అందించగలదని నిరూపించడంతో పాటూ బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను మిగిల్చే సినిమాలను అందించే బ్యానర్ గా పేరు దక్కించుకుంది. కేవలం క్రేజీ కాంబినేషన్లపైనే డిపెండ్ అవకుండా, ఆడియన్స్ అంచనాలకు అనుగుణంగా కంటెంట్ ఉండేలా చూసుకుంటూ హోంబలే ఫిల్మ్స్ చాలా సక్సెస్‌ఫుల్ బ్యానర్ గా ముందుకెళ్తుంది. 5 వరుస బ్లాక్ బ్లాస్టర్ల తర్వాత అక్టోబర్ లో ఈ బ్యానర్ నుంచి కాంతార చాప్టర్ రాబోతుంది. ఈ సినిమా రూ.1000 కోట్ల గ్రాస్ ను వసూలు చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇది కాకుండా రానున్న రోజుల్లో హోంబలే ఫిల్మ్స్ సలార్ లాంటి మరిన్ని క్రేజీ సినిమాలను కూడా లైన్ లో పెట్టారు.
