ఐపిఎల్ టీమ్‌పై కన్నేసిన అపజయమెరుగని నిర్మాత
కిరంగదూర్ ఇటీవల చాలా దూరం ఆలోచిస్తున్నారు. అందుకే క్రికెట్ రంగంలోను సత్తా చాటాలనే ఆలోచన చేస్తున్నారని సమాచారం.
By: Sivaji Kontham | 17 Nov 2025 10:19 AM ISTబ్యాక్ టు బ్యాక్ విజయాలతో అపజయమెరుగని నిర్మాతగా పాపులరవుతున్నారు విజయ్ కిరంగదూర్. ఆయన పట్టిందల్లా బంగారమే. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, కాంతర 2, సలార్ లాంటి భారీ యాక్షన్ చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న హోంబలే ఫిలింస్ అధినేత కిరంగదూర్, మహావతార్ -యానిమేషన్ ఫ్రాంఛైజీతోను అఖండ విజయం అందుకున్నాడు. అతడు ఇప్పుడు దూరదృష్టితో తన పెట్టుబడులను ఇతర రంగాల్లోను విస్త్రత పరచనున్నారని తెలిసింది.
కింగ్ ఖాన్ లా ఆలోచిస్తున్నాడు:
అతడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ తరహాలో ఆలోచిస్తున్నాడు. సినిమా వ్యాపారం సహా విభిన్న రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు హోంబలే సంస్థను విస్తరిస్తున్నాడు. ఖాన్ కొన్నేళ్లుగా కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యజమానిగా ఉన్నాడు. తన టీమ్ కి ఉత్ప్రేరకంగా పని చేస్తూ ఐపీఎల్ లో గొప్ప విజయాలను నమోదు చేస్తున్నాడు. ఇప్పుడు ఖాన్ తరహాలోనే కిరంగదూర్ తన సొంత రాష్ట్రం కర్నాట- బెంగళూరుకు చెందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్.సి.బి) టీమ్ ని కొనుగోలు చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఈ టీమ్ కి పునరుత్తేజం నింపేందుకు భారీగా పెట్టుబడులు సమకూర్చే పనిలో ఉన్నారని తెలిసింది. దీనికోసం సహయజమానులతో కలిసి భాగస్వామిగా మారబోతున్నట్టు తెలుస్తోంది.
క్రీడారంగంలోను హవా:
కిరంగదూర్ ఇటీవల చాలా దూరం ఆలోచిస్తున్నారు. అందుకే క్రికెట్ రంగంలోను సత్తా చాటాలనే ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఇలాంటి సమయంలో ఆర్.సి.బిని ఫ్రాంఛైజీ అమ్మకానికి పెట్టడంతో ఇప్పుడు హోంబలే భాగస్వామ్యంపై కన్నేసింది. దక్షిణ భారతదేశంలో పాపులర్ బ్యానర్ గా హోంబలే సంస్థకు ఉన్న గుర్తింపు కూడా ఐపీఎల్ టీమ్ కి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇక ఆర్సీబీతో హోంబలేకు ఇదివరకూ రకరకాల కోణాల్లో సత్సంబంధాలున్నాయి. అందువల్ల ఇప్పుడు ఆ టీమ్ ని కొనుగోలు చేసేందుకు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు నిర్మాత కిరంగదూర్ వెనకాడటం లేదని తెలుస్తోంది. క్రీడారంగంలోను రాణిస్తే, అది తమ సంస్థకు ఇంకా మంచి పేరు తెస్తుంది. తమ సంబంధాలను కూడా విస్త్రత పరుస్తుందని అతడు భావిస్తున్నారు.
కాంతార 2 తో సంచలనాలు:
ఇటీవలే హోంబలే సంస్థ నిర్మించిన `కాంతార` పాన్ ఇండియాలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా దాదాపు 800కోట్ల వసూళ్లతో కన్నడ సినిమా రంగంలో హిస్టరీని తిరగరాసింది. కేజీఎఫ్ 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కాంతార 2 రికార్డులను సృష్టించింది. అలాగే భారతదేశంలో నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో ఒక యానిమేటెడ్ సినిమాని తెరకెక్కించిన ఘనతను కూడా హోంబలే సంస్థ సొంతం చేసుకుంది. మహావతార్ ఫ్రాంఛైజీని ప్రారంభించి ఇందులో మొదటి సినిమాతో ఘనవియం అందుకున్న సంగతి తెలిసిందే. తదుపరి క్రీడారంగంలోను ఈ సంస్థ అజేయంగా ముందుకు సాగుతుందని అభిమానులు భావిస్తున్నారు.
