థియేటర్‌లలో ఉండగానే ఓటీటీలో బ్లాక్ బస్టర్..!
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం 'వెపన్స్' మూవీ దాదాపుగా రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఒక హాలీవుడ్ మూవీ ఇంత తక్కువ బడ్జెట్‌తో రూపొందడం మామూలు విషయం కాదు.
By: Ramesh Palla | 7 Sept 2025 2:00 PM ISTహాలీవుడ్ ప్రేక్షకులను ఈ మధ్య కాలంలో థ్రిల్‌కి గురి చేసి, భయ పెట్టిన సినిమాలు రాలేదని చెప్పాలి. ఈ ఏడాదిలో హాలీవుడ్ నుంచి పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి, కానీ అందులో మిస్టరీ హర్రర్ సినిమా మాత్రం లేదని చెప్పాలి. హర్రర్ సినిమాలు మంచి కంటెంట్‌తో ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మనం చూస్తున్నాం. అందుకే కాస్త భయపెట్టే విధంగా ఉండి ఆకట్టుకుంటే ఆ థ్రిల్లర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మనం చూస్తున్నాం. బాలీవుడ్ మూవీ స్త్రీ 2 తో పాటు ఇంకా చాలా హర్రర్ సినిమాలు వందల కోట్ల వసూళ్లు నమోదు చేయడం మనం చూశాం. ఇప్పుడు హాలీవుడ్ మూవీ 'వెపన్స్' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. పెట్టిన పెట్టుబడికి దాదాపు నాలుగు.. ఐదు రెట్లు అధికంగా వసూళ్లు నమోదు అవుతున్నాయి.
హాలీవుడ్ మూవీ వెపన్స్ కలెక్షన్స్
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం 'వెపన్స్' మూవీ దాదాపుగా రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఒక హాలీవుడ్ మూవీ ఇంత తక్కువ బడ్జెట్‌తో రూపొందడం మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలకే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వెపన్స్ ను సింపుల్‌గా, తక్కువ బడ్జెట్‌తో పూర్తి చేశారు, అయినా కూడా సినిమాలో ఉన్న కంటెంట్ కారణంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన నాలుగు వారాల్లో ఈ సినిమా దాదాపుగా 250 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేసింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా 500 మిలియన్ డాలర్ల వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. రాబోయే రెండు నెలల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ జోరు కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్‌లో వెపన్స్
వెపన్స్ మూవీ ఇప్పటి వరకు ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంతకు దాదాపుగా డబుల్ వసూళ్లు నమోదు చేసే విధంగా బాక్సాఫీస్ జర్నీ సాగుతోంది. ఈ సమయంలో సినిమాను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయడం చర్చనీయాంశం అయింది. వందల కోట్ల వసూళ్లు నమోదు అవుతున్న సమయంలో ఈ సినిమాను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయడం అనేది తప్పుడు నిర్ణయం అంటున్నారు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆపిల్ టీవీ, గూగుల్ ప్లే ఇతర అంతర్జాతీయ స్థాయి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ పై స్ట్రీమింగ్ కానున్నాయి. ఈనెల 9వ తారీకు నుంచి స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే సినిమాను ఓటీటీలో చూడాలి అంటే ప్రేక్షకులు రెంట్ చెల్లించాల్సి ఉంటుంది అంటూ మేకర్స్ ప్రకటించారు.
థియేటర్‌లో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్
ఇలా రెంట్ విధానం ద్వారా స్ట్రీమింగ్ అయిన సినిమాలు మంచి ఫలితాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు లేవు. థియేటర్ లోనే మరో నాలుగు వారాలు అయినా స్ట్రీమింగ్ చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా 50 మిలియన్ డాలర్ల వసూళ్లను మేకర్స్ ఆశిస్తున్నారట. ఇప్పటి వరకు ఏ సినిమా ఆ స్థాయిలో రాబట్టిందే లేదు. కానీ ఈ సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో ఓటీటీ ద్వారా వస్తాయనే విశ్వాసం ను వ్యక్తం చేస్తున్నారు. జాక్ క్రెగ్గర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆల్డెన్ ఎహ్రెన్‌రిచ్, ఆస్టిన్ అబ్రమ్స్, క్యారీ క్రిస్టోఫర్, టోబి హస్, బెనెడిక్ట్ వాంగ్ ఇంకా తదితరులు నటించారు. ఒక తరగతి గదిలోని పదిహేడు మంది పిల్లల చుట్టూ ఈ హర్రర్ కథ తిరుగుతుంది. ప్రేక్షకులను మాయ లోకంలో విహరింపజేసే విధంగా ఉండటంతో పాటు, భయపెట్టే విధంగా ఈ సినిమా ఉంటుంది. అందుకే భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. మరో నెల రోజుల పాటు ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి ఓటీటీ స్ట్రీమింగ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి.
