మహేష్ 'వారణాసి' రిలీజ్ వరకు అంతేనా?
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ `వారణాసి`. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు.
By: Ravindar Gorantla | 20 Feb 2026 1:00 AM ISTసూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ `వారణాసి`. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమా ప్రారంభించడానికి ముందే కథేంటి?, దీన్ని ఏ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నాను, కథ, కథనం ఎలా ఉంటుంది అనే విషయాల్ని ముందే వెళ్లడించి ఆ తరువాత బరిలోకి దిగే రాజమౌళి ఈ సినిమాకే మాత్రం ఎలాంటి అప్ డేట్‌లు ఇవ్వకుండానే స్టార్ట్ చేయడం తెలిసిందే. అయితే ఇటీవల ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన కీలక విషయాలని బయటపెట్టారు.
అంతే కాకుండా టీజర్‌తోనే ఆశ్చర్యపరిచిన జక్కన్న అందులో చూపించిన వాటిల్లో పురాణాల నేపథ్యంలో సాగే ఎపిసోడ్‌ని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ఈ కీలక ఘట్టాలని ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్నారట. 25 నిమిల నిడివితో సాగే పురాణాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది. ఈ సన్నివేశాల కోసం రూ.300 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారని వార్తలు షికారు చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది.
హాలీవుడ్‌కు చెందిన పలువురు టెక్నీషియన్‌లు వర్క్ చేస్తున్నారు. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు జరిగిన ఆసక్తికర మలుపుల నేపథ్యంలో ఊహకందని సన్నివేశాలతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. త్రేతాయుగం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయట. ఈ ఎపిసోడ్‌లో వచ్చే హనుమంతుడిగా మాధవన్ కనిపిస్తారని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
అంటే మహేష్ సినిమా రావడానికి మరో ఏడాది వేయిట్ చేయాలన్నమాట. ఈ సమయాన్ని మహేష్ సినిమాలతో ఫిల్ చేయాలని కొంత మంది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాది మహేష్ నటించిన ఓల్డ్ మూవీస్ చాలా వరకు విడుదలై ఆ గ్యాప్‌ని ఫిల్ చేశాయి. ఇప్పుడు కూడా `వారణాసి` థియేటర్లలోకి వచ్చేంత వరకు మహేష్ ఓల్డ్ సూపర్ హిట్స్ థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఫిబ్రవరి 28న మహేష్ -త్రివిక్రమ్‌ల తొలి కలయికలో రూపొందిన `అతడు` రీ రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే చాలా సార్లు రీ రిలీజ్ అయింది. అయినా సరే దీన్ని మళ్లీ చూసేందుకు మహేష్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. గతంలో మహేష్ నటించిన `మురారి`, అతిథి, ఖలేజా, బిజినెస్‌మెన్ వంటి సినిమాలు గత ఏడాది విడుదలయ్యాయి. మహేష్ సినిమా లేని లోటుని తీర్చాయి. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో మహేష్ పాత సినిమాలు `వారణాసి` రిలీజ్ అయ్యే వరకు మళ్లీ మళ్లీ రిలీజ్ అవుతూ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాయి.
