Begin typing your search above and press return to search.

లేడి నిర్మాత‌కు అస‌భ్య‌క‌ర క్లిప్ పంపిన న‌టుడు

ది హర్ట్ లాకర్, ది టౌన్ చిత్రాలలో తన నటనకు రెన్నర్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత‌డి న‌ట‌న‌కు వీరాభిమానులున్నారు.

By:  Sivaji Kontham   |   9 Nov 2025 4:00 PM IST
లేడి నిర్మాత‌కు అస‌భ్య‌క‌ర క్లిప్ పంపిన న‌టుడు
X

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సుకుమార్ `బార్న్` సినిమాల‌కు వీరాభిమాని అన్న సంగ‌తి తెలిసిందే. బార్న్ ***** పేరుతో విడుద‌లైన చిత్రాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అద్భుత వ‌సూళ్ల‌ను సాధించాయి. భార‌త‌దేశంలో బార్న్ సిరీస్ సినిమాల‌కు వీరాభిమానులు ఉన్నారు. ది బార్న్ సుప్ర‌మ‌సీ(2004) అనే చిత్రంలో జెరోమీ రెన్న‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. ఈ సినిమాలో త‌న ఐడెంటిటీని దాచేస్తూ, ప్ర‌త్య‌ర్థుల‌కు చిక్క‌కుండా సంచ‌రించే ఒక స్పై పాత్ర‌లో రెన్న‌ర్ అద్భుతంగా న‌టించాడు. థోర్ (2011), ది అవెంజర్స్ (2012) స‌హా ప‌లు హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీల్లో రెన్న‌ర్ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. అత‌డు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాల్లో హాకీ పాత్రతో మ‌రింత పాపుల‌ర‌య్యాడు.

ది హర్ట్ లాకర్, ది టౌన్ చిత్రాలలో తన నటనకు రెన్నర్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత‌డి న‌ట‌న‌కు వీరాభిమానులున్నారు. సోషల్ మీడియాలోను అత‌డు చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. అయితే 2025 జ‌న‌వ‌రిలో అత‌డు ఒక పెను ప్ర‌మాదానికి గురై దాదాపు మృత్యువు నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అత‌డు ఒక స్నో క్లీనింగ్ మెషీన్ పై వెళుతుండ‌గా అది అత‌డి కాళ్ల‌పైకి ఎక్కేయ‌డంతో దాదాపు మృత్యువుతో పోరాడాడు. అదృష్ట‌వ‌శాత్తూ దారిన వెళ్లే ఒక వ్య‌క్తి త‌న‌ను చూసి కాపాడ‌టంతో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇది త‌న‌కు పున‌ర్జ‌న్మ లాంటిది. ఇది త‌న‌ జీవితాన్ని మార్చేసింద‌ని జెరోమ్ రెన్న‌ర్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు.

అయితే ప్ర‌తిభావంతుడైన జెరోమి రెన్న‌ర్ ఇప్పుడు ఒక ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. అత‌డు ప్ర‌ముఖ‌ చైనీస్ ఫిలింమేక‌ర్ యి జౌపై యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE)కి ఫోన్ చేస్తానని బెదిరించారని ఆరోపణ‌లు వ‌చ్చాయి. ఒక డాక్యుమెంటరీ, యానిమేటెడ్ చిత్రంలో క‌లిసి పనిచేసిన జౌ .. రెన్న‌ర్ తో అశ్లీల ఫోటోల‌ను షేర్ చేసిన స్క్రీన్ షాట్లు కూడా వైర‌ల్ అయ్యాయి. సినిమాల‌కు క‌లిసి ప‌ని చేసేప్పుడు ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. వారి మ‌ధ్య రిలేష‌న్ షిప్ మొద‌లైంది. త‌నతో రెండు సినిమాల‌కు ప‌ని చేయాల్సిందిగా స‌ద‌రు చైనీ మ‌హిళా నిర్మాత స్వ‌యంగా రెన్న‌ర్ ను కోరారు. ఆమె రెన్నర్‌తో శృంగారంలో పాల్గొంది. అయితే ఇప్పుడు రెన్న‌ర్ తో చెడింది. వివాదం కార‌ణంగా అత‌డికి వ్య‌తిరేకంగా మీడియాకు ఫిర్యాదు చేసింది. అత‌డికి వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌ను ఆమె డైలీ మెయిల్‌కు అందించింది. జూన్‌లో రెన్నర్ తనకు మెసేజ్ చేసిన ఒక చిన్న పోర్న్ వీడియో క్లిప్ ను కూడా ఆమె మీడియాకు రిలీజ్ చేయ‌డంతో ఇది ర‌చ్చ‌గా మారింది.

రెన్న‌ర్ వైన్ తాగిన మ‌త్తులో రెండు గంటల పాటు కోపంగా నాపై అరిచాని స‌ద‌రు మ‌హిళా ఫిలింమేక‌ర్ చెప్పారు. అమెరికా ఇమ్మిగ్రేష‌న్ అధికారుల‌తో త‌న‌ను ఇబ్బంది పెడ‌తాన‌ని భ‌య‌పెట్టాడ‌ని కూడా ఆమె వాదిస్తున్నారు. అయితే ఈ వివాదం ప్ర‌స్తుతం మీడియాలో ర‌చ్చ‌కెక్క‌డంతో జెరోమ్ రెన్న‌ర్ అభిమానులు తీవ్రంగా క‌ల‌త చెందుతున్నారు.