Begin typing your search above and press return to search.

వారెవ్వా.. ప్రభాస్ సలార్ మూవీనే కాపీ కొట్టిన హాలీవుడ్.. ఆ చిత్రం ఏంటంటే?

అదేంటంటే ప్రభాస్ హిట్ మూవీ నుండి మ్యూజిక్ ని ఓ హాలీవుడ్ మూవీ కాపీ చేసింది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి అనేది చూస్తే..

By:  Madhu Reddy   |   9 Oct 2025 6:15 PM IST
వారెవ్వా.. ప్రభాస్ సలార్ మూవీనే కాపీ కొట్టిన హాలీవుడ్.. ఆ చిత్రం ఏంటంటే?
X

సినిమాల్లో కాపీ ఆరోపణలు రావడం అనేది సర్వసాధారణం.. ఒక సినిమాలో చూసిన క్లిప్, సీన్, డైలాగ్, మ్యూజిక్ ఇలా ఏదైనా సరే.. వేరే సినిమాలో ఉన్నట్టు ఉంటే కచ్చితంగా కాపీ ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అంతేకాదు కొన్ని కొన్ని సందర్భాలలో సినిమాలపై కాపీ రైట్స్ కేసులు కూడా నడుస్తాయి. అయితే తాజాగా అలాంటి కాపీ ఆరోపణలకు సంబంధించి ఒక విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే ప్రభాస్ హిట్ మూవీ నుండి మ్యూజిక్ ని ఓ హాలీవుడ్ మూవీ కాపీ చేసింది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి అనేది చూస్తే..

రీసెంట్ గా ఆపిల్ టీవీలో 'ది లాస్ట్ బస్' అనే సినిమా ప్రమోషనల్ క్లిప్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ప్రోమో క్షణాల్లో వైరల్ అవ్వడంతో చాలామంది ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అచ్చం ప్రభాస్ హిట్ సినిమా సలార్ నుండి కాపీ కొట్టినట్టు ఉంది అంటూ ఆరోపణలు చేస్తున్నారు.అంతేకాదు ది లాస్ట్ బస్ మూవీ ప్రోమోలోని 1:13 సెకండ్స్ నుండి వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తిగా సలార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుండి కాపీ చేశారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి.. సలార్ ట్యూన్ ని ది లాస్ట్ బస్ అనే హాలీవుడ్ మూవీ వాళ్ళు కాపీ చేశారనే ఆరోపణలు రావడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది.

దాంతో చాలామంది నెటిజన్స్ క్లారిటీ రావడం కోసం.. ఈ విషయం తెలియడంతోనే వెంటనే ది లాస్ట్ బస్ కు సంబంధించిన ప్రోమోని చూస్తున్నారు. అయితే కొంతమందికి సలార్ మూవీ లోని ట్యూన్ ని అచ్చం కాపీ చేసినట్లే అనిపిస్తుంది. కానీ మరి కొంతమంది మాత్రం ఈ రెండు సినిమాల బ్యాగ్రౌండ్ స్కోర్ లు ఒకేలా ఉన్నాయి కానీ పూర్తిగా సేమ్ కాదు. కాస్త వేరుగా ఉన్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ కాపీ ట్యూన్ పై కొంతమంది ప్రభాస్ అభిమానులు అయితే ది లాస్ట్ బస్ నిర్మాతలపై, ఆపిల్ టీవీ పై సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అలాగే హోంబలే ఫిలిమ్స్ వాళ్లు దావా వేయాలి అంటూ కోరుకుంటున్నారు. అలా సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా కానీ ఇప్పటివరకు అటు నిర్మాణ సంస్థ అయినటువంటి హోంబలే ఫీల్మ్స్ గానీ,ఆపిల్ టీవీ గానీ ది లాస్ట్ బస్ మూవీ నిర్మాతలు గానీ స్పందించలేదు.

ఒకవేళ స్పందిస్తే ఈ కాపీ ట్యూన్ ఆరోపణలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కానీ ప్రస్తుతం ఈ కాపీ ట్యూన్ ఆరోపణలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి.. పాల్ గ్రీన్ గ్రాస్ డైరెక్షన్లో వచ్చిన ది లాస్ట్ బస్ మూవీలో మాథ్యూ మెక్ కోనాఘో, యుల్ వాజ్ క్వెజ్, కేటీ వార్టన్,అమెరికా ఫెర్రెరా, ఆష్లీ అట్కిన్సన్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 3 నుండి ఆపిల్ టీవీ లో స్ట్రీమింగ్ అవుతుంది.