సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో తగ్గని చిత్రాలు!
హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద `హ్యారీవీన్` సెలవుల ప్రభావంతో ఈ వారాంతంలో వసూళ్లు మందగించాయి.
By: Srikanth Kontham | 2 Nov 2026 1:05 PM ISTహాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద `హ్యారీవీన్` సెలవుల ప్రభావంతో ఈ వారాంతంలో వసూళ్లు మందగించాయి. శనివారం ప్రేక్షకులు వేడుకల్లో బిజీగా ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గింది. అయినా? ఎలిజబెత్ హోమ్స్ డాక్యుమెంటరీ తరహా చిత్రం `యూ కెన్ సీ ఎవ్రీథింగ్`- డీసీ స్టూడియోస్ నుంచి వచ్చిన `క్లేఫేస్` సినిమాలు డల్ వాతావరణంలోనూ బాక్సాఫీస్ రేసులో అగ్రస్థానంలో నిలిచాయి. వారాంతపు వసూళ్లు అంచనాల ప్రకారం 56 మిలియన్ డోలర్లను దాటకపోవచ్చని..ఈ ఏడాదిలోనే రెండవ అత్యల్ప వారాంతపు వసూళ్లుగా రికార్డుకెక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
విడుదలైన మూడో వారంలో ఉన్న `యూ కెన్ సీ ఎవ్రీథింగ్` చిత్రం స్వల్ప ఆధిక్యంతో బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2655 లొకేషన్లలో ప్రదర్శితమైన ఈ సినిమా వీకెండ్లో సుమారు $10.6 మిలియన్లను వసూలు చేసింది. నాథన్ ఫీల్డర్, లాన్స్ ఒపెన్హైమ్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం $7 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందినా? ఇప్పటి వరకు $63.9 మిలియన్లను రాబట్టి మంచి బజ్ సృష్టిస్తోంది. ఈ చిత్రానికి మొదటి స్థానం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మరోవైపు బ్యాట్‌మ్యాన్ విలన్ ఆధారంగా రూపొందిన వార్నర్ బ్రోస్ చిత్రం `క్లేఫేస్` మొదటి స్థానానికి $200,684 తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. రెండవ వారాంతంలో ఈ చిత్రం 57 శాతం డ్రాప్‌ను చవిచూసింది. అయినా? దేశీయంగా మొత్తం వసూళ్లు $44.1 మిలియన్లకు చేరుకున్నాయి. $44 మిలియన్ల నిర్మాణ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద పెట్టుబడిని రాబట్టుకున్నట్లు తెలుస్తోంది.
మూడో స్థానంలో లైకా సంస్థకు చెందిన యానిమేటెడ్ చిత్రం `వైల్డ్‌వుడ్` నిలిచింది. యునైటెడ్ స్టేట్స్ .. కెనడా వ్యాప్తంగా 3,100 థియేటర్లలో ప్రదర్శితమైన సినిమా రెండో వారంలో సుమారు $7.5 మిలియన్లను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం ఇప్పటివరకు మొత్తం $25.9 మిలియన్లను కలెక్ట్ చేసింది. నాలుగో స్థానంలో కామెడి ఫాంటసీ చిత్రం `విక్కర్` నిలవగా, ఐదో స్థానంలో `స్ట్రీట్ ఫైటర్` చిత్రం నిలిచి బాక్సాఫీస్ వద్ద పెర్పార్మెన్స్ కనబరిచాయి.
చివరిగా హాలీవుడ్ బాక్సాఫీస్ ఈసారి హ్యారీవీన్ హడావుడి కారణంగా నెమ్మదించినా? చిన్న .. మీడియం బడ్జెట్ చిత్రాలు పట్టు సడలకుండా వసూళ్లను సాధించడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే మొత్తం దేశీయ బాక్సాఫీస్ వసూళ్లు ఇప్పటికీ 17 శాతానికి పైగా వృద్ధిలో ఉంటూ $8.5 బిలియన్లకు చేరుకోవడం విశేషం. పండుగ వాతావరణం ముగిసిన తర్వాత వచ్చే వారాల్లో పెద్ద చిత్రాల రాకతో బాక్సాఫీస్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
