Begin typing your search above and press return to search.

దారుణ హత్యకు గురైన టాప్ గన్ నటుడు.. అసలేం జరిగిందంటే?

తెరపై తమ నటనతో అద్భుతాలు సృష్టించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతోమంది సెలబ్రిటీలు.. అనూహ్యంగా మృత్యువాత పడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

By:  Madhu Reddy   |   5 Jun 2026 1:32 PM IST
దారుణ హత్యకు గురైన టాప్ గన్ నటుడు.. అసలేం జరిగిందంటే?
X

తెరపై తమ నటనతో అద్భుతాలు సృష్టించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతోమంది సెలబ్రిటీలు.. అనూహ్యంగా మృత్యువాత పడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది వృద్ధాప్య కారణాలతో మరణిస్తే.. మరి కొంతమంది అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడుస్తున్నారు. అయితే ఇక్కడ మరికొంతమంది హత్యకు గురై అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాప్ గన్: మావెరిక్ చిత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఒక నటుడు కూడా దారుణ హత్యకు గురయ్యారు. ముఖ్యంగా ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఇంతటి గొప్ప వ్యక్తిని హత్య చేయడం వెనుక అసలు కారణం ఏమిటి? ఆయనను ఎవరు హత్య చేశారు ? ఎందుకు హత్య చేశారు?అనే కోణంలో అభిమానులు చర్చిస్తున్నారు. మరి ఆయన ఎవరు ? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ఆయన ఎవరో కాదు టాప్ గన్: మావెరిక్, జుమాంజి వంటి చిత్రాలతో హాలీవుడ్లో నటుడిగా ప్రసిద్ధి చెందిన జేమ్స్ హ్యాండీ. ఈయనను తన ప్రియురాలు కుమారుడే హ్యాండీ ఛాతీపై లాస్ ఏంజిల్స్ లోని ఆయన నివాసంలో అత్యంత దారుణంగా పొడిచి చంపడంతో జేమ్స్ హ్యాండీ మరణించినట్లు పోలీస్ కథనాలలో వెలువడింది. లాస్ ఏంజిల్స్ పోలీస్ విభాగం కథనం ప్రకారం.. 81 సంవత్సరాల జేమ్స్ హాండీ బుధవారం ఉదయం 9:30 గంటలకు కాలిఫోర్నియాలోని టార్జానాలో ఉన్న తన ఇంటి ముందు ఆవరణలో విగత జీవిగా కనిపించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను గమనించిన స్థానికులు హాస్పిటల్ కి తరలించే లోపే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు..

జేమ్స్ హాండీ ప్రియురాలు కుమారుడైన 44 ఏళ్ల మైఖేల్ గ్లెడ్ హిల్.. స్వయంగా 911 కి ఫోన్ చేసి.." నేను మానవ పుత్రుడిని.. నేను ఇప్పుడే పాప పురుషుడిని చంపాను" అంటూ పోలీసులతో స్వయంగా తెలిపారు. ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగానే అధికారులతో మీరు వెతుకుతున్నది నన్నే అంటూ చెప్పడం గమనార్హం. అయితే గ్లెడ్ హ్యాండీని చంపడం వెనుక అసలు కారణం ఏమిటి అనే విషయం ఇంకా తెలియ రాలేదు. జేమ్స్ హ్యాండీ హత్యకు గురయ్యాడని తెలియడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

జేమ్స్ హ్యాండీ విషయానికి వస్తే.. 1977లో ర్యాన్స్ హోప్ అనే టెలివిజన్ సిరీస్ తో కెరియర్ ప్రారంభం అయింది. ఇక తర్వాత లోగాన్ , కె 911, లా అండ్ ఆర్డర్, ఎన్సిఐఎస్: లాస్ ఏంజెల్స్ , క్రిమినల్ మైండ్స్ వంటి చిత్రాలలో నటించి విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక 2022లో వచ్చిన టాప్ గన్ చిత్రంలో చివరిగా నటించారు. ఇప్పుడు హత్యకు గురవడంతో సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఇక ప్రస్తుతం జేమ్స్ హ్యాండీ హత్యపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిజం ఒప్పుకున్న గ్లెడ్ ఎందుకు హత్య చేశాడు? అనే విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.