ఆ సూపర్ హిట్ సీక్వెల్‌కి రిలీజ్ తిప్పలు తప్పవా?
టాలీవుడ్‌లో ఓ సూపర్ హిట్ మూవీ సీక్వెల్‌పై వివాదం నెలకొంది. మొదటి పార్ట్ నిర్మాత అనుమతి లేకుండా మరో నిర్మాణ సంస్థతో దర్శకుడు సీక్వెల్ ప్లాన్ చేయడంతో లీగల్ ఇష్యూస్ తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సినిమా పూర్తి చేసిన దర్శకుడు విడుదలకు సిద్ధమవుతుండగా, నిర్మాత లీగల్ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతో సీక్వెల్ విడుదలపై అనిశ్చితి నెలకొంది.
By: Ramesh Palla | 27 Nov 2026 3:00 PM ISTహిట్ సినిమాలకు సీక్వెల్స్ అనేవి కామన్‌గా వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కూడా ఈ నగరానికి ఏమైంది అనే సినిమాకు సీక్వెల్ వచ్చింది. సీక్వెల్ విషయంలో కొన్ని ఇష్యూస్ రావడంతో మేకర్స్ ఈఎన్‌ఈ రిపీట్ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టైటిల్ మార్చడంతో పాటు, మ్యూజిక్ వాడకుండా ఉండటంతో వివాదం ఏమీ లేదని మేకర్స్ చెప్పుకొచ్చారు. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది, బాక్సాఫీస్ వద్ద తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. మొదటి వారం రోజుల్లో దాదాపు రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. హిట్ మూవీ సీక్వెల్ కావడం వల్లే సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మొదటి వారం రోజుల్లో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి అనడంలో సందేహం లేదు. హిట్ సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. అందుకే సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం మనం చూస్తూ ఉంటాం.
సీక్వెల్ పై భారీ నమ్మకం...
ఆ నమ్మకంతోనే చాలా సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్ రూపొందుతున్నాయి. మొదటి పార్ట్‌కు నిర్మాత ఎవరు అవుతారో వారే సెకండ్ పార్ట్‌కు నిర్మాత కావాల్సి ఉంటుంది. అలా అయితేనే కాపీ రైట్ ఇష్యూ రాకుండా ఉంటుంది. టైటిల్ మొదలుకుని ప్రతీది ఆ మొదటి పార్ట్ నిర్మాత వద్ద హక్కులు ఉంటాయి. అందుకే సీక్వెల్‌ను ఆ నిర్మాత కాదంటే తప్ప మరో నిర్మాత నిర్మించేందుకు వీలు లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక సూపర్ హిట్ మూవీ సీక్వెల్ విషయంలో వివాదం నెలకొంది. ఒక చిన్న సినిమాగా వచ్చిన ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కింది. వందల కోట్ల వసూళ్లు నమోదు కావడంతో ఆ దర్శకుడికి మంచి పేరు వచ్చింది. అంతే కాకుండా ఆ ప్రాంచైజీలో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు సీక్వెల్ రాకపోవడంపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్‌లో వరుస సీక్వెల్స్...
మొదటి పార్ట్‌ను నిర్మించిన నిర్మాత సీక్వెల్‌ను నిర్మించేందుకు ఒప్పుకున్నప్పటికీ దర్శకుడు ఏవో కారణాల వల్ల మరో నిర్మాణ సంస్థతో కలిసి సీక్వెల్ ను ప్లాన్ చేశాడు. మొదటి పార్ట్ కు సంబంధం లేకుండా సీక్వెల్ చేస్తున్నానంటూ ఆ దర్శకుడు చెబుతున్నప్పటికీ మొదటి పార్ట్ నిర్మాతలు మాత్రం లీగల్ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే మొదటి పార్ట్ ను నిర్మించిన ఆ నిర్మాత సీక్వెల్‌ను వేరే దర్శకుడితో చేస్తాను అంటూ ప్రకటించాడు. దాంతో వివాదం మరింత ముదిరినట్లు అయింది. సీక్వెల్ ను ఇప్పటికే పూర్తి చేసిన దర్శకుడు విడుదల తేదీని ప్రకటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇలాంటి సమయంలో మొదటి పార్ట్ నిర్మాత నుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చే అవకాశాలు ఉన్నాయని, దాంతో విడుదల విషయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్‌లో భారీ మూవీ...
సీక్వెల్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని ఆశ పడ్డ ఆ దర్శకుడు ఇప్పుడు చిన్నగా అయినా విడుదల చేస్తే చాలు అనుకునే పరిస్థితి నెలకొందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు ఒకవైపు సినిమా మేకింగ్ చూసుకుంటూ, మరో వైపు ఈ లీగల్ ఇష్యూస్ ను దాటే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక స్టార్ హీరోతో సీక్వెల్ చేస్తున్న కారణంగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ విడుదల విషయంలో అటు ఇటు అయ్యి, ఆలస్యం అయితే బజ్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికి అయినా దర్శకుడు మొదటి పార్ట్ నిర్మించిన నిర్మాతతో రాజీ ఒప్పందం చేసుకుంటే బాగుంటుంది అని ఇండస్ట్రీలో కొందరు సూచిస్తున్నారు. కానీ ఈ దర్శకుడు మాత్రం అలా రాజీ కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సోషల్ మీడియాలో ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఏం జరుగుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
