రాజమౌళి దేవుడిని నమ్మడా.. హిందూ జనశక్తి అధ్యక్షుడు ఏమన్నాడంటే..?
ఐతే ఈ వివాదంపై స్పందించారు హిందూ జన శక్తి అధ్యక్షుడు లలిత్ కుమార్.
By: Ramesh Boddu | 18 Nov 2025 10:52 AM ISTవారణాసి ఈవెంట్ లో రాజమౌళి గ్లింప్స్ లేట్ అయిన కారణంగా తాను దేవుడిని నమ్మను అనే ఒక్క కామెంట్ అతనికి ఇప్పటివరకు లేని విధంగా ఒక నెగిటివిటీ తెచ్చింది. అంతకుముందే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజమౌళితో హనుమంతుడు తోడున్నాడని అన్నారు. ఐతే గ్లింప్స్ లేట్ అవ్వడంతో ఇందాకే నాన్న హనుమాన్ తోడున్నాడని అన్నారు. తాను మాత్రం దేవుడిని నమ్మనని అన్నాడు. ఆ టైం లో ఆయన ఆ గ్లింప్స్ రావట్లేదన్న కారణంతో ఆయన అలా అని ఉండొచ్చు.
బాయ్ కాట్ వారణాసి సోషల్ మీడియాలో ట్రెండ్..
ఐతే ఈ విషయాన్ని పెద్దది చేస్తూ వారణాసిని బాయ్ కాట్ చేయాలని కొందరు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఐతే ఈ వివాదంపై స్పందించారు హిందూ జన శక్తి అధ్యక్షుడు లలిత్ కుమార్. రాజమౌళి దేవుడిని నమ్మినా నమ్మక పోయినా ఆయన దేవుడు సినిమాలు చేస్తున్నారని అన్నారు. గుడి మెట్ల ముందు అడుక్కుంటూ గుడిలో దేవుడి మీద నమ్మకం లేని వాళ్లు చాలా మంది ఉంటారు. ఆయన సినిమాలో ఏదైనా వక్రీకరిస్తే తప్పకుండా చూస్తామని అన్నారు లలిత్ కుమార్.
అంతేకాదు గుడి మెట్ల మీద అన్య మతస్తులు కూడా అడుక్కుంటారు. ఇక్కడ డబ్బుని వేరే చోట్ల పెడుతుంటారు. అలాంటి పనులేమి రాజమౌళి చేయలేదు కదా. సినిమా అనౌన్స్ మెంట్ లో ఏదో అలా మాట్లాడారు. ఆయన సినిమాలో ఏదైనా వక్రీకరిస్తే అప్పుడు చూద్దాం. అంతేకాదు ఆయన పేరులోనే చంద్రమౌళీశ్వరుడు ఉన్నాడు. కాబట్టి బాయ్ కాట్ చేస్తాం.. సినిమా చూడమన్న వాదనలు తప్పని అన్నారు లలిత్ కుమార్.
సినిమాలో ఏదైనా వక్రీకరించే పనిచేస్తే..
పఠాన్ సినిమా విషయంలో కూడా బాయ్ కాట్ పఠాన్ అన్నారు. కానీ ఆ సినిమాకు డబ్బులు వచ్చాయి. ఐతే సినిమాలో ఏదైనా వక్రీకరించే పనిచేస్తే అప్పుడు తప్పకుండా ఆ టైంలో చూస్తాం కానీ ఇప్పుడు ఈ విషయం పెద్దది చేయాల్సిన అవసరం లేదని అన్నారు లలిత్ కుమార్. దేవుడి మీద నమ్మకం లేకపోయినా సరే రాజమౌళి ఎందుకు దేవుడు సినిమాలు చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ట్రెండింగ్ అవుతూనే ఉంది.
ఐతే ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో రాజమౌళి ఎప్పుడు ఇలా మాట్లాడింది లేదు. కానీ వారణాసి సినిమా ఈవెంట్ లో దేవుడి గురించి మాట్లాడి హిందూ ధర్మం పాటించే ప్రజలను హర్ట్ చేశారని కొందరు అంటున్నారు. ఐతే వివాదం మరీ పెద్దగా అవ్వకముందే జక్కన్న ఏదైనా చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. సినిమా ఈవెంట్ లో ఏం మాట్లాడినా సరే బాయ్ కాట్ చేస్తామని చెప్పడం ఒక ట్రెండ్ అయ్యింది. ఐతే వారణాసి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. మరి రాజమౌళి నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు.
